మూడు లక్షల రూపాయల విలువైన ఎల్ఓసిని అందించిన ఎమ్మెల్యే జిఎంఆర్
పటాన్చెరు: నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించి వారికి ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలవడంలో ముఖ్యమంత్రి సహాయనిధి అండగా నిలుస్తోందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.
రామచంద్రాపురం డివిజన్ పరిధిలోని అశోక్ నగర్ కాలనీకి చెందిన ప్రసాద్ రావు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శస్త్ర చికిత్స కోసం స్థానిక శాసనసభ్యులు జిఎంఆర్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు మంజూరైన మూడు లక్షల రూపాయల విలువైన ఎల్ఓసి అనుమతి పత్రాలను బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే జిఎంఆర్ చేతుల మీదుగా ప్రసాద్ రావు కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY