టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి బండి రమేష్ అధ్యక్షతన నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం ముసాపేటలోని పార్టీ కార్యాలయం హేమ దుర్గా భవన్ లో శనివారం జరిగింది. రానున్న జిహెచ్ఎంసి ఎన్నికలను ,దృష్టిలో పెట్టుకొని కార్యకర్తలను నాయకులను కార్యోన్ముఖులను చేసేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులు పూర్తిస్థానాలు గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై వారి నుండి సలహాలు సూచనలు సేకరించారు .బూత్ లెవెల్ కమిటీలను నియమించేందుకు త్వరలో డివిజన్ స్థాయి నాయకులతో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా రమేష్ పేర్కొన్నారు .
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళేలా చర్యలు తీసుకోవడం, అర్హులైన లబ్ధిదారులందరికీ వాటి ఫలాలు అందేలా చూడటం కార్యకర్తల బాధ్యత అని రమేష్ ప్రకటించారు. ఎన్నికల్లో పార్టీని గెలిపించేందుకు నాయకులు కార్యకర్తలు ప్రజల్లోకి వెళ్లాలని ప్రత్యర్థి పార్టీల వ్యూహాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం కాంగ్రెస్ సీనియర్ నాయకులు, బ్లాక్ అద్యక్షులు, మార్కెటింగ్ కమిటీ మెంబెర్స్, టెంపుల్ కమిటీ మెంబర్స్ , డివిజన్ అధ్యక్షులు ,బ్లాక్ మహిళా అధ్యక్షురాలు, డివిజన్ మహిళా అధ్యక్షురాలు , యూత్ కాంగ్రెస్, nsui నాయకులు, మైనారిటీ నాయకులు, sc సెల్ నాయకులు, బీసీ సెల్ నాయకులు ,సేవ్ దళ్ నాయకులు మరియు కార్యకర్తలు మరియు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY