SAKSHITHA NEWS

తిరుమలలో ఘ‌నంగా పురుశైవారి తోట ఉత్సవం

       శ్రీ ఆండాళ్ అమ్మ‌వారి తిరువాడిపురం శాత్తుమొరను పురస్కరించుకుని తిరుమలలో పురుశైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది.

      పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణుభక్తుడైన శ్రీ విష్ణుచిత్తుడికి చెందిన తులసీవనంలో భూదేవి అంశగా ఆండాళ్‌(గోదాదేవి) అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సంద‌ర్భాన్ని పుర‌స్క‌రించుకుని టిటిడి ప్ర‌తి ఏడాదీ తిరువాడిపురం శాత్తుమొర నిర్వ‌హిస్తోంది.

  ఇందులో భాగంగా సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు పురుశైవారితోటకు వేంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి, అమ్మవార్లు ఊరేగింపుగా తిరిగి బ‌య‌ల్దేరారు. మార్గ‌మ‌ధ్యంలో పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల‌, శఠారి సమర్పించారు. శఠారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ మాడ వీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు.

  ఈ కార్యక్రమంలో శ్రీవారి అలయ పెష్కర్ శ్రీ. శ్రీహరి, పారుఫతేదార్ శ్రీ బాల సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.
WhatsApp Image 2024 08 08 at 08.12.59

SAKSHITHA NEWS