విజయవాడ: సీఎం జగన్ ‘వైనాట్ 175’ వెనుక దొంగ ఓట్ల ద్వారా లబ్ధి పొందాలనే కుట్ర దాగి ఉందని భాజపా (BJP) రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి (Daggubati Purandeswari) ఆరోపించారు..
విజయవాడలో ‘గావ్ చలో అభియాన్’ను ఆమె ప్రారంభించారు. ఓటర్ల జాబితాలో వైకాపా ఎన్నో అక్రమాలకు పాల్పడుతోందన్నారు. ఒక్క తిరుపతి ఉప ఎన్నికలోనే 35 వేల దొంగ ఓట్లు వేయించారని మండిపడ్డారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆ్రగహం వ్యక్తం చేశారు..
వీటిన్నింటినీ ప్రజలకు వివరించి జగన్ కుట్రలను అడ్డుకుంటామని చెప్పారు. జిల్లాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.కోట్లు మంజూరు చేసిందన్నారు. కేంద్రం సహకారం లేకుండా రాష్ట్రం చేసిందొక్కటీ లేదని విమర్శించారు. ఎన్నికల్లో పొత్తుల విషయం తమ అగ్రనాయకత్వం ఆలోచిస్తోందని పురందేశ్వరి తెలిపారు..