ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక అమలులో అందరూ భాగస్వామ్యం కావాలి..
పట్టణాలు, గ్రామాలను అన్ని రంగాల్లో అభివృద్ధి పరచాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ..
గోపాలపురం చెరువు సమీపంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నాగరాజు , మేయర్ సుధారాణి …
హన్మకొండ జిల్లా/ 56వ డివిజన్ గోపాలపురం
తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా వేగంగా అమలవుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 56వ డివిజన్ గోపాలపురం చెరువు సమీపంలో నిర్వహించిన స్వచ్ఛత కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు , నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి , అధికారులు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులతో కలిసి స్వచ్ఛత కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కల్పించారు….
అనంతరం స్థానికులతో ఎమ్మెల్యే, మేయర్ ప్రమాణం చేయించి అందరూ బాధ్యతగా తమ పరిసర ప్రాంతాలను పరిశుభ్రం ఉంచుకోవాలి పిలుపునిచ్చారు…
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ…
రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం, సమగ్ర అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకుని ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికను రూపొందించిందన్నారు. పట్టణాలు, గ్రామాలు సమానంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మౌలిక వసతుల కల్పన, పరిశుభ్రత, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లో పరిశుభ్రత, శానిటేషన్ వ్యవస్థను మరింత బలోపేతం చేయడం ద్వారా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించాలనే సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. కాలనీలు, వీధులు పరిశుభ్రంగా ఉండేలా మున్సిపల్ యంత్రాంగం సమర్థవంతంగా పనిచేయాలని, ప్రతి పౌరుడు కూడా పరిశుభ్రతను కాపాడటంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.
ప్రజల సమస్యలకు త్వరితగతిన పరిష్కారం అందించేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా వచ్చే 99 రోజులలో పట్టణాభివృద్ధి, రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి అంశాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, సానిటరీ సిబ్బంది, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు….

