అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని నిరూపించిన ఫలితాలు

Sakshitha news

అభివృద్ధి సంక్షేమం లక్ష్యంగా పనిచేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరిస్తారని నిరూపించిన ఫలితాలు జరిగిన మున్సిపల్ ఎన్నికలు అని టిపిసిసి ఉపాధ్యక్షుడు కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బుధవారం జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించిన సందర్భంగా కెపిహెచ్బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ లో శేరీ సతీష్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు .సీఎం రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు .స్వీట్లు పంచారు బాణా సంచా కాల్చారు ఒకరికొకరు అభినందనలు తెలియజేసుకున్నారు ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో తెలంగాణ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని వారి అభిమానమే పార్టీని గెలిపించిందన్నారు.

రాబోయే జెడ్పిటిసి ఎంపీటీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లోను కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని సాధిస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వo చేపట్టిన ప్రజాపాలనకు ప్రజల ఆదరణ ఉందన్నదానికి ఈ ఎన్నికల ఫలితాలే నిదర్శనం అన్నారు. థండర్ మెజార్టీ ఇవ్వడం ద్వారా తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం పై మరో మారు తమ అభిమానాన్నిచాటుకున్నారన్నారు .ప్రజాపాలనకు ఈ ఎన్నికల ఫలితాలు ఓ మైలురాయిగా నిలిచాయన్నారు. ఎన్నికల సందర్భంగా పార్టీ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేందుకు సీఎం చిత్తశుద్ధితో ఉన్నారని రమేష్ పేర్కొన్నారు . జెండాను చేత పట్టుకుని కాంగ్రెస్ జిందాబాద్ రేవంత్ రెడ్డి జిందాబాద్ రాహుల్ గాంధీ జిందాబాద్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, కార్యకర్తలు, డివిజన్ అధ్యక్షులు, మహిళ నాయకురాలు, యూత్ నాయకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top