తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన –

Sakshitha news

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా..

మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 30,16,53 డివిజన్లలో మంచిర్యాల శుభ్రత – ప్రతి ఒక్కరి ఆరోగ్య భద్రత కార్యక్రమంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో మాట్లాడి ఏ సమస్యలు ఉన్న వెంటనే పరిష్కారించాలని ఆదేశించారు..

ప్రజాపాలన ప్రభుత్వంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని పలు సూచనలు చెప్పారు..

ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అన్వేష్ , మేయర్ ధర్ని మధుకర్ , డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్ , కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

Scroll to Top