SAKSHITHA NEWS

ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలి.

  • జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

ప్రజా వినతుల పరిష్కారానికి సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ వి.పి.గౌతమ్‌ సంబంధిత శాఖల జిల్లా స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయ భవన సమావేశ మందిరంలో నిర్వహించిన ‘‘గ్రీవెన్స్‌ డే’’లో అర్జీదారులు సమర్పించిన దరఖాస్తులను జిల్లా కలెక్టర్‌ స్వీకరించి, తగుచర్య నిమిత్తం సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. చింతకాని మండలం బస్వాపురం గ్రామానికి చెందిన చెన్నారెడ్డి, తనకు రామకృష్ణాపురం రెవెన్యూ పరిధిలో వారసత్వంగా వచ్చిన భూమి ధరణిలో నమోదు కాలేదని అట్టి విషయంలో తనకు న్యాయం చేయగలరని సమర్పించిన దరఖాస్తును తగు పరిశీలన నిమిత్తం ధరణి ఓ.ఎస్‌.డి. ని ఆదేశించారు. ఖమ్మం అర్బన్‌ మండలం వెలుగుమట్ల గ్రామంకు చెందిన షేక్‌ అఫ్జల్‌బీ తనకు సర్వేనెం. 235/ఆ లో 35 కుంటల భూమి కలదని అట్టి భూమికి సంబంధించి బ్లాక్‌ లిస్టులో చూపించడం జరుగుతుందని, అట్టి బ్లాక్‌లిస్టును తొలగించగలరని సమర్పించిన దరఖాస్తును తగు చర్య నిమిత్తం అర్బన్‌ తహశీల్దారును ఆదేశించారు. చింతకాని మండలం అనంతసాగర్‌ గ్రామంకు చెందిన ఇటికరాళ్ళ లెనిన్‌ తనకు గుండె జబ్బుచేసి తీవ్ర అనారోగ్యంకు గురికావడం వల్ల వైద్య చికిత్సం పొందుతున్నానని, తనకు దళితబంధు పథకం క్రింద మంజూరైన పాడి గేదల నిర్వహణ సాధ్యం కానందువల్లన మరోక యూనిట్‌ మంజూరుకు, వందనం గ్రామంకు చెందిన నారపోగు ఉమాశేఖర్‌ తాను దళితబంధు క్రింద సెంటిఫిక్స్‌, సర్జికల్స్‌ యూనిట్‌కు దరఖాస్తు చేసుకోవడం జరిగిందని అట్టి యూనిట్‌ను త్వరితగతిన మంజూరు చేయించగలరని సమర్పించిన దరఖాస్తులను పరిశీలన చేసి తగుచర్య నిమిత్తం ఎస్సీ కార్పోరేటషన్‌ ఇ.డి. కి ఆదేశించారు. ఖమ్మం, 1వ డివిజన్ కైకొండాయిగూడెం నుండి బోడ రవికుమార్, కైకొండాయిగూడెం కాశీ విశ్వేశ్వరస్వామి వారి దేవస్థానం క్రింద దేవుని మాన్యం అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఐడిఓసి ప్రాంగణం వెనుక భాగాన పార్కింగ్‌ ప్రాంతంలో వాహనములకు షెడ్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. ప్రతి గురువారం ఐడిఓసి కార్యాలయంలో అధికారులు, సిబ్బంది ఉదయం 9.00 గంటలకు పరిసరాల పరిశుభ్రత క్లీన్‌అండ్‌ గ్రీన్‌ కార్యక్రమంలో పాల్గొనాలని ఆన్నారు. తమకు కేటాయించిన కార్యాలయ భవనాన్ని పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలన్నారు. ప్రతి కార్యాలయాన్ని ఉన్నతాధికారులు సందర్శించి సిబ్బంది విధుల నిర్వహణ సమయపాలనను పర్యవేక్షిస్తారన్నారు. ఖమ్మం జిల్లాకు మంజూరు అయిన వైద్య కళాశాలలో 100 అడ్మిషన్లకు సంబంధించిన ప్రక్రియను, కల్పించవలసిన అన్ని ఏర్పాట్లను సిద్దం చేసుకోవాలన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన కోర్టు కేసులను త్వరితగతిన పరిష్కారానికి కౌంటర్‌, అఫిడవిట్లు ధాఖలు చేయడం, కేసు ముగిసే వరకు ఏస్థాయిలో ఉన్న సమాచారాన్ని పర్యవేక్షించాలన్నారు.
అదనపు కలెక్టర్‌ స్నేహలత మొగిలి, ఎన్‌.మధుసూదన్‌, జిల్లా రెవెన్యూ అధికారి శిరీష, ఆర్‌.డి.ఓ రవీంధ్రనాద్‌, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు ‘‘గ్రీవెన్స డే’’లో పాల్గొన్నారు


SAKSHITHA NEWS