దేశవ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలకు అంతా సిద్ధమవుతున్నారు. నవమి వేడుకలను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి ఊరూ, వాడలా ఆలయాలు, వీధులన్నీ ముస్తాబు చేశారు.. చైత్ర మాసం శుక్లపక్షం 9వ రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటారు భక్తులు. ఈ సంవత్సరం ఏప్రిల్ 17వ తేదీన శ్రీరామనవమి వేడుకను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడానికి సకలా ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఈ సందర్బంగా అయోధ్య శ్రీ రామ మందిర్ ట్రస్ట్ ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనాన్ని రద్దు చేశారు. ఏప్రిల్ 15 నుంచి 18 వరకు నవరాత్రుల నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనం నిషేధించబడింది. అయోధ్యలోని రామమందిరంలో రామనవమి సందర్భంగా దర్శనానికి వీఐపీ పాస్‌లపై నిషేధించారు. ట్రస్ట్ జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం, ఏప్రిల్ 15 నుండి ఏప్రిల్ 18 వరకు భక్తులకు హారతి కోసం ఎటువంటి రాయితీ దర్శనం లేదా VIP పాస్‌లు అందుబాటులో ఉండవు.