SAKSHITHA NEWS

హామీలు అమలు చేయమంటే అణగదొక్కే చర్యలు దుర్మార్గం

మున్సిపల్ కార్మికుల ఆందోళనకు మద్దతుగా చీపురు పట్టిన నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు

ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ ఆందోళన చేస్తున్న మున్సిపల్ కార్మికుల పట్ల జగన్ రెడ్డి అణచివేసేలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గమని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ధ్వజమెత్తారు.మున్సిపల్ కార్మికుల ఆందోళనకు మద్దతుగా పట్టణంలోని సత్తెనపల్లి రోడ్డులో గాంధీ బొమ్మ సెంటర్ వద్ద చీపురు పట్టి రోడ్లు ఊడ్చారు.

ఈ సందర్భంగా డా౹౹చదలవాడ మాట్లాడుతూ కరోనా సమయంలో మున్సిపల్ కార్మికుల్ని వీరులు,శూరులు అంటూ కీర్తించిన జగన్ రెడ్డి ఇప్పుడు వారి హక్కుల పై ఎందుకు దృష్టి పెట్టడం లేదని ప్రశ్నించారు.స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి,మున్సిపల్ కమిషనర్ ఉద్యోగుల పట్ల అత్యంత కర్కశంగా వ్యవహరిస్తున్నారంటూ మండిపడ్డారు.కరోనా సమయంలో ప్రాణలు పణంగా పెట్టి పని చేసిన వారిని పొట్టకొట్టడం దుర్మార్గమన్నారు.న్యాయమైన సమస్యల పరిష్కారం పై ఎందుకింత చిన్నచూపు అని నిలదీశారు.మున్సిపల్ కార్మికుల సమ్మెను సైతం అణచివేసేలా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి,మున్సిపల్ కమిషనర్ ప్రవర్తించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు.

న్యాయం చేయలేని ముఖ్యమంత్రి,ఎమ్మెల్యే,మున్సిపల్ మంత్రి,మున్సిపల్ కమిషనర్ ఆయా పదవుల్లో కొనసాగే అర్హతే లేదని డా౹౹చదలవాడ ధ్వజమెత్తారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వేల్పుల సింహాద్రి యాదవ్,జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి కొట్ట కిరణ్,జిల్లా కోశాధికారి గట్టుపల్లి సత్యనారాయణ,రాష్ట్ర మైనార్టీ నాయకులు మన్నన్ షరీఫ్,మీరవాలి,రాష్ట్ర వాణిజ్య విభాగ నాయకులు వనమా శివ,అత్తులూరి సుబ్బారావు,సంజీవ్ రావు,మాబు,తిరుమలకొండ నరసింహ రావు,కాండ్రతి సాంబయ్య,చింతిరాల బాలు,మొహమ్మద్ రఫీ,కనుమూరి లక్ష్మీ,రాజ్యలక్ష్మి,విజయలక్ష్మి,వనమా పవన్,కోడూరి రాము,జీపీ కుమార్,పెరికాల రాయప్ప,సల్మాన్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS