SAKSHITHA NEWS

సాక్షిత : ఎడ తెరిపి లేకుండా అకాలంగా కురిసిన భారీ వర్షాల కారణంగా ముంపు ప్రాంతలలో కలిగే సమస్యలను స్వయంగా తెలుసుకోవడానికి ముంపుకు గురయ్యే లోతట్టు ప్రాంతల్లో పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ . అందులో భాగంగా
ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని తులసి నగర్ మరియు అల్విన్ కాలనీ ఫేస్ 2 కాలనీ ల లో కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి పర్యటించి, పరిశీలించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
అకాల వర్షాల కారణంగా ముంపుకు గురైన ప్రాంతాలను పరిశీలించడం జరిగింది. వర్షాల వల్ల రోడ్లపై పేరుకుపోయిన మట్టిని తొలగించి వెంటనే శుభ్రపరచాలని జిహెచ్ఎంసి సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు. అలాగే అల్విన్ కాలనీ ఫేస్ 2 లో ఉన్న ఖాళీ స్థలాన్ని పార్క్ కోసం వినియోగించుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ అకాల వర్షాలతో ప్రజలందరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజలందరూ ఇల్లు మరియు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకుని విష జ్వరాలు ప్రబలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అదేవిధంగా వర్షం దృష్ట్యా ముంపు ప్రాంతాలు మునిగిపోకుండా ముందస్తు చర్యలో భాగంగా అన్ని రక్షణ చర్యలు తీసుకోవాలని, మాన్ సున్ ,ఎమర్జెన్సీ టీమ్స్ లు అన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని, ప్రజలకు అందుబాటులో ఉండలని, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్లి పరిష్కరించాలని, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాల చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలని,కరెంట్ ,మంచి నీటి సరఫరా లో ఇబ్బందులు తలెత్తకుండా చూడలని , ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడలని, అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు

అదేవిధంగా నాలలో కూరుకుపోయిన చెత్త చెదరాంను తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా చూడలని ,మిగిలిపోయిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలనీ, నాలలకు రక్షణ చర్యలలో భాగంగా ఫెన్సింగ్ వేయాలని, రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని, నాల మరియు ముంపు పరిసర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండలని ,తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ విప్ గాంధీ అధికారులకు తెలియచేసారు. అదేవిదంగా వర్షాలను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని,గత వర్షాకాలంలో నాలా పొంగి ప్రవహించడం ద్వారా ఇండ్లలోకి నీరు ప్రవహించి ,పరిసరాలు నీటమునిగిన పరిస్థితి  విదితమే దీనిని దృష్టిలో పెట్టుకొని మళ్లీ పునరావృతం కాకుండా పనులు చేపట్టామని ,నాలా లో పేరుకుపోయిన చెత్త, మట్టిని  పూడిక తీత ద్వారా తొలగించి నీటి ప్రవాహం సాఫీగా సాగేలా  ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూడలని, అధికారులు తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో ఆల్విన్ కాలనీ డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి బీఆర్ఎస్ పార్టీu నాయకులు రాజేష్ చంద్ర, కాశినాథ్ యాదవ్, శివరాజ్ గౌడ్, కృష్ణారావు, వెంకటేష్ గౌడ్, కట్టా శ్రీనివాసరావు, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, సంతోష్ ,బిరాదర్, ఉమేష్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS