Prioritize feedback complaints
స్పందన పిర్యాదులకు ప్రాధాన్యత ఇవ్వండి – మేయర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి
సాక్షిత తిరుపతి : స్పందన పిర్యాదులకు, అదేవిధంగా డయల్ యువర్ కమిషనర్ కి వచ్చే పిర్యాదులు, అర్జీలకు తగిన ప్రాధాన్యత ఇచ్చి పరిష్కరించాలని అధికారులనుద్దెసించి తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి అన్నారు.
తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సోమవారం డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమంలో మేయర్ డాక్టర్ శిరీషా, కమిషనర్ అనుపమ అంజలి, డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ పిర్యాదులను పరిశీలిస్తూ ఆటోనగర్, కృష్ణానగర్ ప్రాంతాల్లో రోడ్లు, కాలువలు, వీది లైట్లు ఏర్పాటు చేయాలని ఆ కాలనీవాసులు తెలుపగా త్వరలోనే పరిశీలించి పనులు చేపడుతామన్నారు.
కెనడినగర్లో తమ ఇంటి ముందు వాహనాలు పార్కింగ్ చేస్తున్నారని, గృహాలు వుండే చోట వాణిజ్య సముదాయాలు నిర్మించడం వలన ఈ సమస్య వుత్పన్నమవుతున్నదనే పిర్యాదుపై తమ టౌన్ ప్లానింగ్ అధికారులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటారని హామి ఇవ్వడం జరిగింది.
18వ వార్డులో ఓక వ్యక్తి రోడ్డును ఆక్రమించడం వలన ఇబ్బందులను ఎదుర్కొంట్టున్నామని కొంతమంది ప్రజలు పిర్యాదు చేయగా వెంటనే పరిశీలించి చర్యలు తీసుకుంటామన్నారు. ఎల్.బి నగర్లో ప్రభుత్వ బావిని ఆక్రమించి మెకానిక్ షాపును ప్రారంభించారనే పిర్యాదుపై తక్షణమే అధికారులను పంపించి చర్యలు తీసుకుంటామన్నారు.
అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో మురుగునీరు సమస్యలు, మరికొన్ని ప్రాంతాల్లో గుంతలమయమైన రోడ్ల గురించి పిర్యాదులు రాగా తమ అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవడం జరుగుతుందని మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ అనుపమ అంజలి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, ఉప కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, ఎస్.ఈ మోహన్, ఎంఈలు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు సేతుమాధవ్, లోకేష్ వర్మ, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, సెక్రటరి రాధిక, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు తదితర అధికారులు పాల్గొన్నారు.