SAKSHITHA NEWS

సాక్షిత : తిరుపతి నగరంలో రోడ్లపై ఆక్రమనలను, వాహనాలు పార్కింగ్ చేయడంపై తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత ఐఏఎస్ అధికారులతో మాట్లాడుతూ హోటల్స్, షాపుల వాళ్ళు, మాల్స్ వద్ద రోడ్లపై వాహనాలు పార్కింగ్ చేస్తుండడం, కొన్ని షాపుల వాళ్ళు రోడ్లపై తమ సామాగ్రీని వుంచుకోవడ్స్ం వలన ప్రజలకి ఇబ్బందిగా వున్నాయని, అలాంటి ప్రదేశాల్లో పార్కింగ్ చేయకుండ, ఆక్రమణలు లేకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. డయల్ యువర్ కమిషనర్, స్పందన కార్యక్రమం సోమవారం తిరుపతి నగరపాలక సంస్థ కార్యలయంలో జరిగింది. అశోక్ నగర్, అబ్బన్న కాలనీలో రోడ్డుపై వెల్డింగ్ ఇనుప సామాన్లు, చికెన్ షాపు వాళ్ళు కోళ్ళ బాక్సులు పెట్టడం వలన వాహనాలు తిరగడానికి ఇబ్బందిగా వుందనే పిర్యాధుపై స్పందిస్తూ ఆక్రమణలు తొలగిస్తామన్నారు. భైరాగిపట్టెడలోని ఓక రెస్టారెంట్ నుండి చికెన్ బిర్యాని ఆర్డర్ చేయగా, అది చెడిపోయిందని రెస్టారెంట్ వారికి చెప్పినా స్పందించలేదనే పిర్యాదుపై స్పందిస్తూ, హెల్త్ ఆఫిసర్ కి ఆదేశాలు జారీ చేస్తూ పరిశీలించాలన్నారు. మహిళా యూనివర్సిటీ హండ్రెడ్ రోడ్ ఏరియాలో కుక్కల బెడద అనే పిర్యాధుపై స్పందిస్తూ, హెల్త్ ఆఫిసర్ తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేసారు. కొర్లగుంట జెపి ప్లాజా ప్రక్కన పెద్ద కాలువలో చుట్టు ప్రక్కల వాళ్ళు వ్యర్థాలు, చెత్తను వేస్తున్నారని చెబుతూ క్లీన్ చేయించి, కాలువపై స్లాబ్ వేయించమనగా పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు.

శ్రీనగర్ కాలనీ 5వ క్రాస్ నందు ఒక ఇంటి వారు డ్రైనేజిని రోడ్డుపైకి వదిలేస్తున్నారని చెప్పగా చర్యలు తీసుకుంటామన్నారు. సుభాష్ నగర్లో చెన్నై బేకరి సందులో బోరు వేసి వచ్చిన వ్యర్ధాలను రోడ్డుపై వదిలేయడంతో వాహనదారులకు ఇబ్బందులు పడుతున్నారనే పిర్యాదుపై స్పందిస్తూ శుభ్రం చేయిస్తామన్నారు. సి.పి.ఎం నాయకులు పిర్యాధు చేస్తూ మధురానగర్ సెవెన్ హిల్స్ స్కూల్ ముందు, వినాయకుని గుడి ముందు డ్రైనేజి పొంగుతున్నదని అదేవిధంగా మధురానగర్ 4వ క్రాస్ నందు డ్రైనేజి పొంగి మంచినీటి సంపుల్లో కలుస్తున్నదనే పిర్యాదుపై పరిశీలించి తగు చర్యలు చేపడుతామన్నారు. కొన్ని ప్రాంతాల్లో డ్రైనేజి సమస్యలు గురించి పిర్యాధులు చేయగా, వెంటనే శుభ్రం చేయిస్తామన్నారు. సోమవారం జరిగిన డయల్ యువర్ కమిషనర్ కు 13 పిర్యాధులు, అదేవిధంగా స్పందన కార్యక్రమంలో 25 అర్జీలు, పిర్యాధులు అందగా వాటిని పరిశీలించి సంబంధిత అధికారులకు కమిషనర్ హరిత ఐఏఎస్ ఆదేశాలు జారీ చేస్తూ ఎప్పటికప్పుడు వస్తున్న సమస్యలని అధికారులు వెంటనే పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కమిషనర్ సునీత, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళీశ్వర్ రెడ్డి, సెక్రటరీ రాధిక, మునిసిపల్ ఇంజనీర్లు చంద్రశేఖర్, వెంకట్రామిరెడ్డి, రెవెన్యూ అధికారులు కె.ఎల్.వర్మ, సేతుమాధవ్, హెల్త్ ఆఫిసర్ డాక్టర్ హరికృష్ణ, మేనేజర్ చిట్టిబాబు, డిఈలు విజయకుమార్ రెడ్డి, రవీంద్ర రెడ్డి, గోమతి, మహేష్ తదితర అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 06 05 at 5.28.06 PM

SAKSHITHA NEWS