సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం

SAKSHITHA NEWS

Press conference at Congress Party office in Suryapet district headquarters

సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడిన నల్లగొండ పార్లమెంట్ సభ్యులు కుందురు రఘువీర్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారు : రఘువీర్ రెడ్డి
……………………………………………………………………………
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఈనెల 24,25 తేదీల్లో జరగనున్న పార్లమెంట్ సమావేశాల్లో ప్రమాణస్వీకారం చేసేందుకు ముందుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా సీనియర్ నేత దామోదర్ రెడ్డి ఆశీర్వాదం కోసం వచ్చానని నియోజకవర్గంలో ప్రజలు 70వేల ఓట్ల మెజార్టీతో నన్ను గెలిపించినందుకు కార్యకర్తలకు, నాయకులకు ముందుండి నడిపించిన రంరెడ్డి దామోదర్ రెడ్డికి ధన్యవాదాలితెలిపారు. నియోజకవర్గంలో పలు సమస్యలను నా దృష్టికి తెచ్చారు అలాగే నేను ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆదరణ తగ్గిందన్న మాజీ మంత్రి జగదీశ్ రెడ్డికి ప్రజలు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పారని నల్లగొండ జిల్లాలో అసెంబ్లీలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ఓడించిన ప్రజలు ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు సైతం లేకుండా చేశారని గుర్తుచేశారు. ప్రజల గురించి ప్రజా సమస్యల గురించి మాట్లాడడం మానేసి కాంగ్రెస్ నాయకులను చెప్పుతో కొడతామని మాజీమంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడడం సరికాదన్నారు. చత్తీస్ గడ్ కరెంటు ఒప్పందంపై జ్యూడిషియన్ కమిషన్ వేస్తే కమిషన్ను తప్పు పట్టడాన్ని ప్రజలు గమనిస్తున్నారని వరిది తప్పు అయితే వారిని ప్రజలు చెప్పుతో కోడతారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు.

WhatsApp Image 2024 06 20 at 15.43.09

SAKSHITHA NEWS