Prashant Varma, Teja Sajja, ‘Hanu-Man’ film unit visit Ayodhya temple to start promotions
ప్రమోషన్స్ ప్రారంభించడానికి అయోధ్య ఆలయాన్ని సందర్శించిన ప్రశాంత్ వర్మ, తేజ సజ్జ, ‘హను-మాన్’ చిత్ర యూనిట్
క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఫస్ట్ ఒరిజినల్ ఇండియన్ సూపర్ హీరో చిత్రం హను-మాన్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇందులో తేజ సజ్జా టైటిల్ రోల్ పోషిస్తున్నారు. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న తొలి సినిమా ఇది. ఇటివలే విడుదలైన ఈ క్రేజీ పాన్ ఇండియా సినిమా టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. హను-మాన్ టీజర్ యావత్ దేశం హనుమంతుని నామం జంపించేలా చేసింది.
నిన్న, దర్శకుడు ప్రశాంత్ వర్మ , హీరో తేజ సజ్జాతో సహా హను-మాన్ టీమ్ శ్రీరాముని ఆశీర్వాదం కోసం అయోధ్య ఆలయాన్ని సందర్శించారు. టీజర్ కి వచ్చిన రెస్పాన్స్‌తో ఆనందంలో ఉన్న టీమ్, ప్రమోషనల్ క్యాంపెయిన్ ను ప్రారంభించడానికి ఆధ్యాత్మిక యాత్రకు బయలుదేరారు.
అమృత అయ్యర్ కథానాయికగా నటిస్తుండగా ఈ క్రేజీ పాన్ ఇండియా చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుండగా శ్రీమతి చైతన్య సమర్పిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్ , వినయ్ రాయ్ & రాజ్ దీపక్ శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
టాప్-గ్రేడ్ టెక్నీషియన్స్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. గౌరహరి, అనుదీప్ దేవ్, కృష్ణ సౌరభ్ ఈ చిత్రానికి సౌండ్‌ట్రాక్‌లను అందిస్తున్నారు. దాశరధి శివేంద్ర సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు.
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా అస్రిన్ రెడ్డి, లైన్ ప్రొడ్యూసర్ గా వెంకట్ కుమార్ జెట్టి, అసోసియేట్ ప్రొడ్యూసర్ గా కుశాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
హను-మాన్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మేకర్స్ త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తారు.
తారాగణం: తేజ సజ్జ, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్‌కుమార్, వినయ్ రాయ్, గెటప్ శ్రీను, సత్య, రాజ్ దీపక్ శెట్టి తదితరులు
సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: ప్రశాంత్ వర్మ
నిర్మాత: కె నిరంజన్ రెడ్డి
బ్యానర్: ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్
సమర్పణ: శ్రీమతి చైతన్య
స్క్రీన్‌ప్లే: స్క్రిప్ట్స్విల్లే
డీవోపీ: దాశరధి శివేంద్ర
సంగీత దర్శకులు: అనుదీప్ దేవ్, గౌరా హరి, కృష్ణ సౌరభ్
ఎడిటర్: ఎస్బీ రాజు తలారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అస్రిన్ రెడ్డి
లైన్ ప్రొడ్యూసర్: వెంకట్ కుమార్ జెట్టి
అసోసియేట్ ప్రొడ్యూసర్: కుశాల్ రెడ్డి
ప్రొడక్షన్ డిజైనర్: శ్రీనాగేంద్ర తంగాల
పీఆర్వో : వంశీ-శేఖర్
కాస్ట్యూమ్ డిజైనర్: లంకా సంతోషి