ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి తారురోడ్డు బురదమయం
సాక్షిత : ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం సోమేపల్లి తారురోడ్డుగ బురదమయంగా మారింది గతంలో ఈ రోడ్డు పాలకుల నిర్లక్ష్యానికిగురై
ఆధ్వనంగా ఉండేది నిరంతరం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు మండల కేంధ్రమైన త్రిపురాంతకం వెళ్ళిరావడానికి కూడా బాధలు పడేవారు.
సోమేపల్లి గ్రామప్రజలు విన్నుతన రీతిలో పలుమార్లు తమ నిరసనలు తెలియజేశారు ఎట్టకేలకు సోమేపల్లి రహదారిని తారు రోడ్డుగా మార్చారు. అయితే ఇదే సోమేపల్లి మార్గం గుండా ఇటుక బట్టీలకు సంబందించిన ట్రాక్టర్ లతో నిత్యం మట్టి తోలుతుంటారు. ఆ మట్టి అంత రోడ్డుపై పడి రోడ్డు రూపురేఖలే మారిపోయి అడుగు మందం బురద రోడ్డుపై పేరుకుపోయింది.
వర్షం పడిందంటే రోడ్డంతా బురదమయంగా మారి ధ్విచక్ర వాహనాలు జారిపడుతున్నాయి
ప్రజలు ప్రమాదలకు గురివుతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సోమేపల్లి రహదారిపై తగుచెర్యలు తీసుకోవాలెనని గ్రామస్థులు కోరుకుంటున్నారు.