ప్రకాశం బైకర్లపై ఉక్కుపాదం మోపుతున్న ప్రకాశం జిల్లా పోలీసులు
బైకులకు అధిక శబ్దం చేసే మాడిఫైడ్ సైలెన్సర్ల లను రోడ్ రోలర్ తో ధ్వంసం
రణగొణ శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకుని ప్రజలకు, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కల్గిస్తే చట్టపరమైన చర్యలు
సాక్షిత : జిల్లా ఎస్పీ శ్రీమతి మలిక గర్గ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఒంగోలు టౌన్ పరిధిలో విపరీతమైన ధ్వని పుట్టించే సైలెన్సర్ల బైకర్లపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఒంగోలు టౌన్ లో తనిఖీ చేపట్టి ద్విచక్ర వాహనాలకు మాడిఫైడ్ సైలెన్సర్ల ద్వారా అధిక శబ్దం చేసే 120 సైలెన్సర్ లను వాటిని ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ శ్రీనివాసరావు ఒంగోలులోని అద్దంకి సెంటర్ వద్ద రోడ్ రోలర్ తో ధ్వంసం చేశారు.
ఈ సందర్భంగా ఒంగోలు ట్రాఫిక్ డిఎస్పీ మాట్లాడుతూ మోటార్ వాహనాల చట్టం నిబంధనలు ఉల్లంఘించి వాహన తయారీదారులు ఇచ్చిన సైలెన్సర్ స్థానంలో అధిక శబ్దాన్నిచ్చే సైలన్సర్లతో ప్రయాణించే వాహనాలను ఉపేక్షించమన్నారు. బైకులకు విపరీత శబ్దాన్నిచ్చే సైలెన్సర్ అమర్చుకుని శబ్ద కాలుష్యం సృష్టిస్తే చట్టపరమైన చర్యలు తీసుకోవడమే కాకుండా జరిమానా విధిస్తామని, వాహనాలకు మాడిపైడ్ సైలెన్సర్లను విక్రయించే షాపుల యజమానులు, వాటిని బిగించే మెకానిక్ లపై కూడా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
బైకులకు కంపెనీలు నిర్ధేశించిన సైలెన్సర్స్ తీసివేసి వేరే సైలెన్సర్లను మార్చడం వలన ధ్వని, గాలి కాలుష్యం జరుగుతుందని, అంతేగాక బైకు పికప్, మైలేజ్ తగ్గిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయని, కావున ఎవరరూ కూడా మోడిఫైడ్ సైలెన్సర్లను వాడరాదని సూచించారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలు మరియు రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, వాహనాలకు రణగొణ ధ్వనులు చేసే సైలెన్సర్ అమర్చుకొని ప్రజలకు, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కల్గించకుండా బాధ్యతాయుతంగా ఉండాలని కోరారు.