ఏపీలో రాజకీయ రగడ.. పింఛన్‌దారులకు ఇంకా అందని నగదు.. ఎప్పుడు ఇస్తారంటే..
ఏపీలో వాలంటీర్ వార్ నడుస్తోంది. వాలంటీర్ వ్యవస్థపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా, వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వొద్దంటూ సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో.. రాజకీయం మరింత వేడెక్కింది. అవ్వా-తాతలపై చంద్రబాబు కక్ష కట్టారని వైసీపీ నేతలు నిప్పులు కక్కుతుంటే.. వాలంటీర్లతో రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నాయకులు..
ఏపీలో వాలంటీర్ వార్ నడుస్తోంది. వాలంటీర్ వ్యవస్థపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా, వాలంటీర్లు ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వొద్దంటూ సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేయడంతో.. రాజకీయం మరింత వేడెక్కింది. అవ్వా-తాతలపై చంద్రబాబు కక్ష కట్టారని వైసీపీ నేతలు నిప్పులు కక్కుతుంటే.. వాలంటీర్లతో రాజకీయం చేస్తున్నారని మండిపడుతున్నారు టీడీపీ నాయకులు.. వీటన్నింటి మధ్య.. ఆంధ్రప్రదేశ్‌లో ఒకటో తేదిన ఇంటికే వచ్చే పెన్షన్ లబ్దిదారులకు ఇంకా అందలేదు.
వాలంటీర్లు వైసీసీకి పనిచేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదులు అందడంతో.. ఇకపై ఎలక్షన్ విధుల్లోను, ప్రభుత్వ పథకాల పంపిణీను వాలంటీర్లు పాల్గొనొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ. దీంతో ఒకటో తేదినే అందాల్సిన పింఛన్ ఈనెల 3న పంపిణీ చేయనున్నారు.. ఇప్పటి వరకూ ఇళ్ల దగ్గర ఇచ్చే పెన్షన్.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు గ్రామ, వార్డు సచివాలయాల్లో అందజేయనున్నారు.
వాలంటీర్లు వైసీసీకి పనిచేస్తున్నారంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఈసీకి ఫిర్యాదు చేయడంతో… వాలంటీర్లు ఎలక్షన్ విధుల్లో, ప్రభుత్వ పథకాల పంపిణీలో పాల్గొనొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది ఈసీ. లేటెస్ట్‌గా పెన్షన్ విషయంలోనూ సెర్ప్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. వాలంటీర్లు లబ్దిదారుల ఇంటికెళ్లి పెన్షన్ ఇవ్వొద్దంటూ ఆదేశించింది. ప్రతి ఒక్కరూ గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి పెన్షన్ తీసుకోవాలని సూచించింది. దీంతో టీడీపీ నేతలపై మాటల యుద్దానికి దిగారు వైసీపీ నేతలు.
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పుణ్యమాని అవ్వా-తాతలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కత్తి కట్టారని మండిపడ్డారు. ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లు నగదు పంపిణీ చేయరని సజ్జల చెప్పారు. ఇంటింటికీ కాకుండా సచివాలయం దగ్గరకు వెళ్ళి పెన్షన్ తీసుకోవాలన్నారు. చంద్రబాబు పుణ్యమాని అవ్వా-తాతలు ఇబ్బంది పడాల్సి వస్తుందన్నారు సజ్జల. వాలంటీర్ వ్యవస్థపై చంద్రబాబు కత్తి కట్టారని మండిపడ్డారు.
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సైతం చంద్రబాబుపై మండిపడ్డారు. వాలంటీర్ వ్యవస్థను ఆపి పేదల కడుపు కొట్టిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందంటూ విమర్శలు గుప్పించారు.
వైసీపీ నేతల మాటలపై ఇటు టీడీపీ సైతం కౌంటర్ ఎటాక్‌కి దిగింది. వాలంటీర్లను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు అచ్చెన్నాయుడు. పెన్షన్ల విషయంలో కావాలనే రాజకీయం చేస్తున్నారని ఫైరయ్యారు.
అచ్చెన్నాయుడుతో పాటు బోండా ఉమా సైతం వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు కక్కారు. పెన్షన్‌దారులను ఇబ్బంది పెడుతున్నది జగన్ ప్రభుత్వమే అంటూ విమర్శలు గుప్పించారు. పెన్షన్ పేరుతో రాజకీయాలు చేయొద్దంటూ వార్నింగిచ్చారు.
మొత్తంగా ఏపీలో వాలంటీర్ వ్యవస్థతోపాటు పెన్షన్ల పంపిణీ విషయంలోనూ రాజకీయ రచ్చ నడుస్తోంది.