అక్రమంగా తరలిస్తున్న పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
కమలాపూర్ సాక్షిత న్యూస్ (నవంబర్ 12)
కమలాపూర్ మండల పరిధిలోని పంగిడిపల్లి గ్రామంలో అక్రమంగా బియ్యం సరఫరా అవుతున్న, సమాచారాన్ని అందుకున్న పోలీసులు వెంటనే స్పందించి సమాచారం మేరకు వరంగల్ టాస్క్ ఫోర్స్ మరియు కమలాపూర్ సిబ్బంది ఆధ్వర్యంలో పిడిఎస్ బియ్యంను అక్రమంగా TS 02UA2127 అను నెంబరు గల అశోక్ లేలాండ్ వాహనంలో 42 క్వింటానుల బియ్యాన్ని దాని విలువ సుమారు 1,63,800రూ,,గల 85 బస్తాలు 50 కిలోల వాటిని పట్టుకున్నారు. పంగిడిపల్లి గ్రామానికి చెందిన ఆశల శ్రీకాంత్ తండ్రి రవీందర్ తరలిస్తుండగా మరిపల్లిగూడెం గ్రామ శివారులో పట్టుకొని కేసు నమోదు చేసినట్లు ఎస్సై వీరభద్రరావు తెలిపారు. కమలాపూర్ గ్రామ శివారులోని పంగిడిపల్లి రోడ్డులో గల సాంబశివ రైస్ మిల్లులో అక్రమంగా నిల్వ ఉంచిన 27 క్వింటానుల పిడిఎస్ బియ్యం విలువ సుమారు 1, 05, 300రూ,, వాటిని సీజ్ చేసి యజమాని అయిన బెజ్జంకి శ్రీనివాస్ తండ్రి చంద్రమౌళి పై కేసు నమోదు చేసినట్లు, ఆ తర్వాత ఉప్పల్ గ్రామానికి చెందిన పుల్ల బాబు తండ్రి అంకుస్ అను అతడు తన బంధువుల గ్రామమైన పంగిడిపల్లిలో సుమారు పది క్వింటానుల బియ్యం దాని విలువ 39,000రూ,,గల వాటిని నిలువ ఉంచగా అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు . తదుపరి ఆ ముగ్గురిని అరెస్టు చేసి బెయిల్ పై విడుదల చేయడం అని ఎస్సై వీరభద్రరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.