లంబాడితండాలో పోలీసుల కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం….
గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం… గ్రామస్తులకు అవగాహన…
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి: రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని బెల్లంపల్లి రూరల్ పోలీసుల ఆధ్వర్యంలో బుధవారం తెల్లవారుజామున లంబాడితండా గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామంలో తనిఖీలు చేపట్టి గుడుంబా, అక్రమ మద్యం స్వాధీనం చేసుకున్నారు.
కార్యక్రమంలో భాగంగా జగారి అంకులు అనే వ్యక్తి వద్ద నుంచి 15 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే అజ్మీరా శేఖర్ వద్ద నుంచి 180 ఎంఎల్ సామర్థ్యం గల 144 ఓసీ మద్యం సీసాలు, 2 డెక్కన్ వైట్ ఫుల్ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.
అదేవిధంగా గ్రామంలో 20 మోటార్‌సైకిళ్లు, 2 ఆటోలు, 2 ట్రాక్టర్ల పత్రాలను పోలీసులు తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా బెల్లంపల్లి రూరల్ సీఐ హోనుక్ మాట్లాడుతూ గుడుంబా తయారీ, విక్రయాలు చట్టవిరుద్ధమని గ్రామస్తులకు తెలియజేశారు. యువత మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. అలాగే సైబర్ నేరాలు, ట్రాఫిక్ నిబంధనలు, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ కార్యక్రమంలో తాళ్ల గురిజాల ఎస్‌ఐ రామకృష్ణ, బెల్లంపల్లి-2 టౌన్ ఎస్‌ఐ కిరణ్ కుమార్‌తో పాటు బెల్లంపల్లి రూరల్ సర్కిల్ పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
