దుండిగల్ సర్కిల్ బిజెపి ఆధ్వర్యంలో సర్కిల్ పరిధి అన్ని గ్రామాలలో దోమల నివారణ పై గతంలో ఎన్ని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించిన బీజేపీ నాయకులు
దుండిగల్ సర్కిల్ బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి అధ్యక్షతన గతంలో ప్రత్యేకంగా, మరియు మీడియా ద్వారా దోమల నివారణ పై ఫిర్యాదులు చేసిన పట్టించుకోకపోవడంతో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ప్రజల కోరిక మేరకు మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగింది .
బీజేపీ అధ్యక్షులు పీసరి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నాడు బీఆర్ఎస్ పార్టీ నేడు కాంగ్రెస్ పార్టీ కలెక్షన్ ల మీద తప్ప ప్రజా సమస్యల మీద పట్టి లేని పాలన అయింది
దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్లిన దోమల అనేది కనిపించడం లేదు కానీ తెలంగాణలో హైదరాబాద్ చుట్టుపక్కల ఏ ఊరికి వెళ్ళిన బస్తీ వాసులతో గాని కుటుంబ సభ్యులతో కానీ దోమలు విపరీతంగా ఉధృతి పెరగడం వల్ల ప్రశాంతంగా ఆరు బయట కూర్చోనివ్వడం లేదు గతంలో చిన్నతనంలో ఓపెన్ మోరీలు ఉన్న పేడ తోని ఇంటి ముందు కల్లాపి చల్లిన చూడడానికి ఒక దోమ ఉండేది కాదు సాయంత్రం వేళలో భస్తి వాసులందరు ఆటలు పాటలు ఆకాశంలో నక్షత్రం లెక్కపెట్టుకుంటూ ప్రశాంతంగా గడిపేది.
కానీ ప్రస్తుత రోజుల్లో ఆరుబయట ఏమో గాని ఇంట్లో అర్ధరాత్రి ప్రశాంతంగా నిద్ర పోదామన్నా ఐదు నెంబర్ ఫ్యాన్ పెట్టినా కూడా దోమల ఉదృతి భరించలేని పరిస్థితి ఉంది. కావున వెంటనే ఈ యొక్క దోమలు నివారణపై రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని దోమల నివారణ కోసం చర్యలకు పాటుపడాలని బిజెపి తరఫున డిమాండ్ చేయడం జరిగింది దోమలు అంటే చెప్పడానికి చిన్న చూపు చులకన అనిపించవచ్చు కానీ కుటుంబ సభ్యులతో గానీ బస్తీ వాసులతో గాని ప్రశాంతంగా మానసికంగా కూర్చొని ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోలేని పరిస్థితి ఏర్పడింది ఇది ప్రతి ఒక్కరు ఇళ్లలో ఇదే సమస్య కావున ప్రతి మున్సిపల్ పరిధి ప్రతి గ్రామంలో ప్రతి గేటెడ్ కమ్యూనిటీలలో మెయిన్ రోడ్ల పొంటే కాకుండా గల్లీ గల్లీలో దోమలు నివారణ చర్యలు చేపట్టాలని దుండిగల్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ను మరోసారి మెమొరాండం ఇచ్చి కోరడం జరిగింది
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఏ మల్లేష్ యాదవ్,ధమ్మగారి ప్రభాకర్ రెడ్డి,సర్కిల్ బీజేపీ ఉపాధ్యక్షులు ఎంబరి ఆంజనేయులు ఉపాధ్యక్షురాలు నడికట్ల రోజా,బిజెపి సర్కిల్ ప్రధాన కార్యదర్శి తురాయి భాను గౌడ్ మున్సిపల్ కార్యదర్శి తలారి రాజ్ కుమార్,నాగమణి అతిల్ తదితరులు పాల్గొన్నారు

