హిందూ భావాలను రక్షిస్తూ – నిరసన మరియు దిష్టిబొమ్మ దహనం

Sakshitha news

హిందూ భావాలను రక్షిస్తూ – నిరసన మరియు దిష్టిబొమ్మ దహనం

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 డివిజన్ పరిధిలోని గాంధీ విగ్రహం వద్ద, డివిజన్ అధ్యక్షులు జోగిని రాజు నేతృత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హిందూ దేవి దేవతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా, రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. నిరసన కార్యక్రమంలో, దేవి దేవతలను అవమానించే వ్యాఖ్యలు హిందూ సమాజం మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని గుర్తుచేసి, ప్రభుత్వం వైఖరిపై ఆందోళన వ్యక్తం చేసిన బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో జాన్సీ, సతీష్ చక్రవర్తి, అరవింద్, సతీష్, ఎశ్వంత్, సంజీవ్ రెడ్డి, నాగమణి, సతీష్ రంగంపేట్, ప్రసాద్ శర్మ, పాపయ్య దొర,రవీందర్ రెడ్డి,వెంకు,అంజయ్య, వీరేశం, శ్రవణ్ బోస్, సోనీ, శ్రీకాంత్, మహేష్, మూర్తి, దత్తు, హేమంత్ తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top