హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ

Sakshitha news

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ కాలనీ లో గల పలు సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై, GHMC ఇంజనీరింగ్ విభాగం, శానిటేషన్ విభాగం, హార్టికల్చర్ విభాగం, మరియు GHMC స్ట్రీట్ లైట్, జలమండలి అధికారులతో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాసులతో కలిసి కాలనీ లో పాదయాత్ర చేసిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు .

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, కాలనీ వారి విజ్ఞప్తి మేరకు అన్ని విభాగాలతో కలసి కాలనీ లో పర్యటించి ప్రతి చిన్న సమస్య గురించి చర్చించి, వెంటనే సమస్యలు పరిష్కారం జరిగేలా చూడాలని అధికారులకు చెప్పడం జరిగింది అలానే పలు కాలనీ లలో ప్రజల నుండి వచ్చిన వినతి మేరకు మరియు మా దృష్టికి వచ్చిన సమస్యలను పరిగణలోకి తీసుకొని ప్రత్యేక చొరవ తో డివిజన్ లో అత్యవసరం ఉన్న చోట, నిత్యం సమస్యలతో ఉన్న ప్రాంతలలో ప్రథమ ప్రాధాన్యత గా పనులు పూర్తి చేస్తామని నార్నె శ్రీనివాసరావు తెలియచేశారు.

ఏ చిన్న సమస్య అయిన నా దృష్టికి వచ్చిన తప్పకుండా పరిష్కరిస్తామని, కాలనీ లలో మౌలిక వసతుల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ కాలనీలను అన్ని రంగాలలో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకు వెళుతు సమస్య రహిత ఆదర్శవంతమైన కాలనీ లు గా తీర్చిదిద్దడమే నా ప్రథమ లక్ష్యం అని, ప్రజలకు స్వచ్ఛమైన, చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణం కలిపిస్తామని నార్నె శ్రీనివాసరావు చెప్పడం జరిగినది, అలానే అన్నివేళలా ప్రజలకు అందుబాటులోకి ఉంటానని, మెరుగైన ప్రజా జీవనానికి అన్ని రకాల మౌలిక వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని,  అదే విధంగా హైదర్ నగర్ డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన, అగ్రగామి డివిజన్గా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, స్ట్రీట్ లైట్ సుధాకర్, హార్టికల్చర్ దాసు, జలమండలి వర్క్ ఇన్స్పెక్టర్ నాగరాజు, వారి సిబ్బంది కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top