SAKSHITHA NEWS

POET కవియిత్రి మొల్ల స్వతంత్ర భావాలే మనకు ఆదర్శం

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్”

షాద్ నగర్ లో “కవయిత్రి మొల్ల” విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే శంకర్

షాద్ నగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో కుమ్మర్ల బోనాలు

301 కలశాలతో తొలి ఆశాడ బోనాన్ని పోచమ్మకు సమర్పించిన కుమ్మరి సంఘం

రామాయణాన్ని అతి సులువైన పదాలతో తెలుగులో రాసి తన సరళమైన పదజాలానికి అందరూ ముగ్దులయ్యేలా చేసిన కవయిత్రి మొల్ల ఆమె స్వతంత్ర భావాలే మనకు ఆదర్శం కావాలని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ సూచించారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో కవయిత్రి మొల్ల విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ లాంచనంగా ఆవిష్కరించారు. షాద్ నగర్ కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు నడికూడ జయంతత్ రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్, స్థానిక అధ్యక్షులు కుమ్మరి శ్రీశైలం, ప్రధాన కార్యదర్శి కాంగ్రెస్ యువనేత రాయికల్ శ్రీనివాస్
తదితరులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ప్రసంగించారు. మొల్ల
రాసిన రామాయణం ‘మొల్ల రామాయణం’గా ఎంతో ప్రసిద్ధి చెందిందనీ, రామాయణాన్ని తెలుగులో రాసిన తొలి కవయిత్రిగా కూడా ఆమె ఎంతో పేరు ప్రఖ్యాతలు గాంచిందన్నారు. మొల్ల అసలు పేరు మొల్లమాంబ అనీ, ఆమె 16వ శతాబ్దపు తెలుగు కవయిత్రి అని వివరించారు. ఈమె కుమ్మరి కుటుంబంలో జన్మించిందని మొల్ల శ్రీ కృష్ణదేవరాయల సమయంలోని వారని కూడా ప్రసిద్ది అని అన్నారు. ఇక మొల్ల రచనలను చదివినవారు మొల్ల రచనా శైలి చాలా సరళమైందని, రమణీయమైనదని అంటారనీ ఆమె గొప్పతనాన్ని ఎమ్మెల్యే శంకర్ అందరికీ వివరించారు.
సమాజంలో కుమ్మరుల పాత్ర ఎంతో గొప్పదని వారు లేని సమాజాన్ని ఊహించుకోలెమని శంకర్ అభినందించారు. ఈ సందర్భంగా సంఘం ఆధ్వర్యంలో ఆషాడ మాసం సందర్భంగా 301 కలశాలతో అమ్మవార్లకు బోనాలను సమర్పించారు. మొదటి బోనాన్ని పోచమ్మ దేవతకు సమర్పించినట్టు యువనేత రాయికల్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బోనాన్ని ఎమ్మెల్యే శంకర్ స్వయంగా నెత్తిన ఎత్తుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు నడికూడ జయంతత్ రావు, ప్రధాన కార్యదర్శి దయానంద్ స్థానిక అధ్యక్షులు శ్రీశైలం ప్రధాన కార్యదర్శి రాయికల్ శ్రీనివాస్, స్థానిక కాంగ్రెస్ నేతలు మహమ్మద్ అలీ ఖాన్ బాబర్ మాజీ మున్సిపల్ చైర్మన్ అంగనూరు విశ్వం, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలరాజ్ గౌడ్, లింగారెడ్డిగూడెం అశోక్, కుమ్మరి సంఘం నాయకులు పెంజర్ల రమేష్ శ్రీశైలం, సాయిలు అంజయ్య బ్రహ్మయ్య వెంకటేష్ కృష్ణ విట్యాల అంజయ్య కోమాల్ నర్సింలు శంకరయ్య లింగం యాదయ్య జంగయ్య బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు..

POET

SAKSHITHA NEWS