SAKSHITHA NEWS

మొక్కల సంరక్షణ జీవకోటికి
రాజమహేంద్రవరం, సాక్షిత :
శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి ఆధ్వర్యంలో
ఎ.బి.వి.పి.లోని స్టూడెంట్ ఫర్ డెవలప్మెంట్ విభాగం వారు, చేతనా ప్రకృతి సేవా సంస్థ వారు సహకారములతో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో భాగంగా 750 మొక్కలు నాటే కార్యక్రమమును నిర్వహించారు. ఈ సందర్భంగా
సేవా తరంగిణి అధ్యక్షులు విజయ స్వామి, కార్యదర్శి శివ స్వామి మాట్లాడుతూ చిరంజీవి ఇషా ప్రథమ జన్మదిన సందర్భంగా నాయుడు గారి వంటిల్లు అధినేత శ్రీమాన్ రాకేష్, రమాదేవి దంపతులు ఈ కార్యక్రమానికి సహకరించారన్నారు. జనసేన పార్టీ నగర ఇన్చార్జి అను శ్రీ సత్య నారాయణ బృందం చేతుల మీదుగా మొక్కలు నాటి ,శ్రమదానం చేసిన సేవకులకు పుస్తక పంపిణీ చేశారని అన్నారు.
అను శ్రీ సత్య నారాయణ మాట్లాడుతూ సేవా తరంగిణి మొక్కలు నాటడమే కాదు వాటిని రక్షణ కూడా చేసే విధంగా ఆలోచించడం చాలా గొప్ప విషయమన్నారు.

శ్రీ అమ్మ ఒడి సేవా తరంగిణి స్థాపించి 12 సంవత్సరాలైన సందర్భంగా ఈ సంవత్సర కాలంలో ఐదు వేల మొక్కలు నాటి రక్షించే కార్యాన్ని తలపెట్టిందని, ప్రకృతిని రక్షించే ఈ దివ్య కార్యము చాలా ఆనందకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు. అదే విధంగా పుష్కర మహోత్సవాలలో భాగంగా సేవాతరంగిణి చేపట్టిన 108 ఆలయాల వద్ద 108 ఉచిత శ్రీనివాస కల్యాణ మహోత్సవముల స్వాగత సమితి సభ్యునిగా నేను చేరడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని,మా వంతు సహకారాలు సేవా సంస్థ కు ఎల్ల వేళలా వుంటుందని అన్నారు. తుంగల రాకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి వారి కుటుంబ వేడుకల సందర్భంగా ప్రకృతి రక్షణ కార్యాలు చెప్పటినట్లయితే భావి తరాలు,పర్యావరణం బాగుపడుతుందని,ఈ విషయంలో సేవా తరంగిణి కృషి చాలా విశేషంగా వుందని అన్నారు. సేవా తరంగిణి సభ్యులు కురుమళ్ళ నాగ వెంకట ధన లక్ష్మి, బూటి నాగమణి, ఐసెట్టి వీర వెంకట సత్యనారాయణ, లోకేష్, దొరబాబు, కోయ దుర్గా భవాని, సాయి భరద్వాజ్, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 08 19 at 16.19.18

SAKSHITHA NEWS