pharma అనకాపల్లి జిల్లా పరవాడ భరణికం గ్రామాల మధ్య ఉన్న మొల్లోడు గడ్డలో ఫార్మా వ్యర్థ రసానిక జలాలతో తీవ్ర దుర్గంధాన్ని వెదజల్లుతున్న ప్రాంతాన్ని సిపిఎం జిల్లా కార్యదర్శి కే లోకనాథం, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గని శెట్టి సత్యనారాయణ పరిశీలించారు ఈ సందర్భంగా లోకనాథం మాట్లాడుతూ ఫార్మా రసానికి వ్యర్థ జలాల శుద్ధిచేసి సముద్రానికి పంపించవలసి ఉండగా చెరువుల్లో గడ్డల్లో కాలవల్లో నిబంధనలకు విరుద్ధంగా విడుదల చేస్తున్న రాంకీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని భూగర్భ జలాల పరిరక్షణకు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తారు దీనిపై జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు చేస్తున్నట్లు లోకనాథం తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు జి శ్రీనివాసరావు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app