SAKSHITHA NEWS

సింగల్ విండో విధానం ద్వారా గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి
-ఆర్డీఓ కె. లక్ష్మి శివజ్యోతి
రాజమహేంద్రవరం, సాక్షిత:
వినాయక చవితి మండపాల్లో గణేష్ విగ్రహాల ఏర్పాటు చేసే వారు సింగిల్ విండో విధానం ద్వారా అనుమతులు పొందాలని ఆర్డీఓ అధికారి కె. లక్ష్మి శివజ్యోతి అన్నారు. గురువారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో గణేష్ ఉత్సవాలు అనుమతులు విధివిధానాలు అమలుపై సంబంధిత అధికారులతో రెవిన్యూ డివిజనల్ అధికారి కె.లక్ష్మి శివజ్యోతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజమహేంద్రవరం అర్బన్ పరిధికి మున్సిపల్ కమిషనర్, రూరల్ కు సంబంధించి రెవెన్యూ డివిజన్ అధికారి గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతులు మంజూరు చేయడం జరుగుతుందన్నారు.

ఎక్కువ శాతం మట్టితో తయారు విగ్రహాలకు ప్రాధాన్యత నివ్వాలని, ఆదిశగా అనుమతి ఇచ్చే ముందే అధికారులు ఆయా ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించాలన్నారు. విగ్రహాల ఏర్పాటుకు పర్మిషన్ కు దరఖాస్తు చేసుకున్న వెంటనే వారు ఏర్పాటు చేసుకుని స్థలానికి వెళ్లి కమిటీ పరిశీలించాలని ఆమె సూచించారు. విగ్రహ ఏర్పాటులో రోడ్డుకి అడ్డంగా ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా ఉండే విధంగా ఉన్నవాటికే అనుమతులు మంజూరు చేయాలన్నారు. గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేసే పందిళ్ళలో కరెంటును అక్రమంగా వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మండల కేంద్రాలలో తాసిల్దార్ కార్యాలయంలో ఒక టీం గా ఏర్పాటు చేసుకొని పనిచేయాలని ఆమె అన్నారు అనుమతులు మంజూరు చేసే విషయంలో తేది, టైం పరిశీలించి సరిచూసుకోవాలని ఆమె అన్నారు నిమజ్జన సమయంలో ప్రభుత్వం గుర్తించిన పాయింట్ల వద్దని నిమజ్జనం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖను ఆదేశించారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం లేకుండా చూడాలన్నారు నిమజ్జన చేసే ప్రదేశంలో భక్తులు ఎవరు ఎక్కువ లోతులోకి వెళ్లకుండా ముందస్తుగా హెచ్చరికలు జారీ చేయాలన్నారు పొల్యూషన్ నివారించే దిశగా విగ్రహాల ఏర్పాటులో ఎక్కువగా మట్టి విగ్రహాలని ఏర్పాటు చేసే విధంగా కమిటీ వారికి తగు సూచనలు జారీ చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో పోలీస్, ఆర్.అండ్.బి, ఇరిగేషన్, దేవాదాయ, డిఎం అండ్ హెచ్ ఓ, పంచాయతీరాజ్, ఎక్సైజ్, ఫిషరీస్, అగ్నిమాపక, ట్రాన్స్కో, ఎమ్మార్వోలు, ఎంపీడీవోలు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS