SAKSHITHA NEWS

పింఛన్లు పంపిణి
-కమిషనర్ కేతన్ గార్గ్


సాక్షిత రాజమహేంద్రవరం :
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలోగల 95 సచివాలయముల పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల ను సంబంధిత సచివాలయ కార్యదర్శుల ద్వారా లబ్దిదారులకు అందచేయుడం జరుగుతుందని రాజమహేంద్రవరం కమిషనర్ కేతన్ గార్గ్ ఒక ప్రకటనలో తెలియజేశారు. పెన్షన్ పంపిణి కార్యక్రమం ప్రతినెల 1న ఇవ్వాల్సి ఉండగా ఈనెల 1న ఆదివారం సెలవు దినం రావడం వల్ల ఈనెల 31నే (ముందురోజు)శనివారం ఉదయం 5గంటల నుండి పించను దార్లక ఇవ్వనున్నట్లు ఆయన తెలిపారు. ఒకవేళ ఎవరికైనా అందని పక్షంలో, తీసుకోలేని క్రమంలో 2వ తేదీన ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వారు ఆదేశముల మేరకు పెన్షన్లు పంపిణి చేసి లబ్దిదారులకు నగదు రశీదులు అందించబడును. కావున పెన్షన్ దారులు తమ పెన్షన్ కొరకు సచివాలయములకు రానవసరం లేదని తెలియజేయడమైనది.


SAKSHITHA NEWS