SAKSHITHA NEWS

వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

  • మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు
  • నగరంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన జన సైనికులు

రాజమహేంద్రవరం, సాక్షిత : జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు రాజమండ్రి జనసేన పార్టీ అధ్యక్షులు వై శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా ఆడంబరాలకు దూరంగా ఉండాలని పవన్ కళ్యాణ్ పిలువునిచ్చిన నేపథ్యంలో పలు సేవా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఉదయం 6 గంటలకు నందం గని రాజు జంక్షన్ వద్ద మొక్కలు నాటీ క్లీన్ ఆంధ్రా -గ్రీన్ ఆంధ్ర ప్రాముఖ్యత చాటి చెప్పుతూ మొక్కలు పంచి పెట్టారు. దేవి చౌక్ సెంటర్ వద్దనున్న భవన నిర్మాణ కార్మికులకు అల్పాహారం ఏర్పాటు చేశారు. రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇంచార్జ్ అత్తి సత్యనారాయణ మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలియచేశారు. అనంతరం కేక్ కట్ చేసి జన సైనికులు వీర మహిళలతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ నిత్యం రాష్టం, దేశం బాగుండాలని కోరుకునే జనసేన పార్టీ అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా సేవా కార్యక్రమాలలో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. గబ్బర్ సింగ్ రీ రిలీజ్ పవన్ ఫాన్స్ ను మరోసారి ఉర్రూతలూగించిందన్నారు. సినిమా, రాజకీయం రెండు రంగాల్లో విజయం సాధించి తన స్టామినా నిరూపించుకుని పవన్ విమర్శలు చేసిన వైసీపీ నాయకుల నోళ్లు మూయించారన్నారు ప్రకృతి విపత్తుల సమయంలో తక్షణం స్పందించి సాయం చేయడంలో జనసైనికులు ముందుంటారని కొనియాడారు. క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర అంటూ పరిశుభ్రత పచ్చదనం కోసం పవన్ కళ్యాణ్ ఇచ్చిన పిలుపుకు రాష్ట్రమంతా మంచి స్పందన వచ్చిందన్నారు. పవన్ కళ్యాణ్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని కోరుతూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. వై. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి ఫలాలను అందించే దేశీయ మొక్కలను నాటి భావితరాలకు స్వచ్ఛమైన పకృతిని అందించేందుకు ఉసిరి, వేప, నేరేడు మరియు ప్రకృతికి హాని కలిగించని పూల మొక్కలను పంచిపెట్టడం జరిగిందన్నారు. ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న పవన్ కళ్యాణ్ రానున్న రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టి ప్రజలకు సేవ చేయాలని ఆకాంక్షించారు. అత్తి సత్యనారాయణ మాట్లాడుతూ సమాజం పట్ల బాధ్యతతో ప్రజల పక్షాన నిలిచి పోరాడుతున్న జనసేనాని సినిమాలో మాత్రమే కాదు నిజ నివితంలో హీరో అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు జామి సత్యనారాయణ, తేజోమూర్తిల, దాసరి గురునాథరావు, సబ్బ రాజేష్ కన్నా, షేక్ బాషా లిమ్రా, అక్కిరెడ్డి ప్రసాద్, కుడుపూడి చలపతి రావు, పాలిక సతీష్, వైవిడి ప్రసాద్, గెడ్డం నాగరాజు, వీర మహిళలు ముమ్మిడి భాగ్యలక్ష్మి, యందం ఇందిరా, సిరి నాయుడు, పద్మ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
Sai Rajamundry


SAKSHITHA NEWS