SAKSHITHA NEWS

కోదాడ బిసి విద్యార్థి సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా పవన్ నియామకం.
నిద్ర సంపత్ నాయుడు విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు –

సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా)
బిసి విద్యార్థి సంఘం కోదాడ నియోజకవర్గ అధ్యక్షునిగా పవన్ ను నియమించడం జరిగిందని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు నిద్ర సంపత్ నాయుడు తెలిపారు. కోదాడ నియోజకవర్గ కేంద్రంలో కోదాడకు చెందిన పవన్ ను బీసీ విద్యార్థి సంఘ అధ్యక్షునిగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆదేశాల మేరకు నియమించడం జరిగింది అని ఆయన తెలిపారు.

ఈ సందర్భంగా సంపత్ నాయుడు మాట్లాడుతూ. నూతనంగా ఎన్నికైన పవన్ బీసీల కొరకు అదేవిధంగా విద్యార్థుల సమస్యల పరిష్కారం కొరకు జాజుల శీనన్న నాయకత్వంలో పనిచేయాలని సూచించారు.సంఘ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని కోరారు. బిసి సంఘం నియోజకవర్గ అధ్యక్షునిగా పవన్ కు నియామక పత్రాన్ని అందజేసిన సందర్భంగా పవన్ మాట్లాడుతూ.నా నియమకానికి సహకరించిన రాష్ట్ర అధ్యక్షులు గొడుగు మహేష్ యాదవ్, జిల్లా అధ్యక్షులు సంపత్ నాయుడు లకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం అధ్యక్షులు బుర్ర నాని, వంశీ, నరేష్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app