
గోపాల్పేట ఎస్సీ హాస్టల్ విద్యార్థి మూర్చతో కిందపడి మృతి
విద్యార్థి కుటుంబానికి న్యాయం చేయాలని విద్యార్థి సంఘాల నిరసన
సాక్షిత వనపర్తి
వనపర్తి జిల్లా గోపాల్పేట మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్లో 8వ తరగతి చదువుతున్న ఏదుట్ల గ్రామానికి చెందిన భరత్ (13)అనే విద్యార్థి ఉదయం 7 గంటల కు హాస్టల్ స్టడీ అవర్స్ లో తోటి విద్యార్థులతో కలిసి చదువుకుంటుండగా మూర్చ( ఫిట్స్) తో కింద పడిపోయాడని చాలాసేపు అలాగే ఉండిపోవడంతో తోటి విద్యార్థులు అంతా కలిసి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు అక్కడ వైద్యులు పరీక్షించి విద్యార్థి అప్పటికే మృతి చెందాడని తేల్చి చెప్పడంతో విద్యార్థి తల్లిదండ్రులు ఏదుట్ల గ్రామానికి చెందిన ఉడుముల వెంకటేష్ అరుణలకు సమాచారం అందివ్వడంతో వారు బంధువులు గ్రామస్తుల తో కలిసి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని ఆ చేతనంగా పడి ఉన్న తమ కుమారుడు మృతదేహాన్ని చూసి విలపించారు
భరత్ కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని టిఆర్ఎస్వి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా టిఆర్ఎస్వి జిల్లా అధ్యక్షులు హేమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ హాస్టల్స్ గురుకులాల లో చదువుతున్న పేద విద్యార్థులు ప్రభుత్వం అధికారులు సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది విద్యార్థులు చనిపోతున్నారని ఇదంతా ప్రభుత్వం నిర్లక్ష్యం పర్యవేక్షణ లేకపోవడం వల్లే అని పేద విద్యార్థులు గురుకులా హాస్టల్లో చేరేందుకు ఇప్పటికే గురుకులాల్లో మృతి చెందిన విద్యార్థుల సంఘటనాలను చూసి తమ పిల్లల్ని చేర్పించేందుకు తల్లిదండ్రులు భయపడుతున్నారని గురుకుల హాస్టల్స్ మూసి వేసి పేద విద్యార్థులకు విద్యను దూరం చేయాలని ప్రభుత్వ కుట్ర చేస్తోందని ఆరోపిస్తూ ప్రభుత్వ కుట్రను తిప్పికొట్టేందుకు విద్యార్థుల తరఫున బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు భరత్ మృతికి కారణమైన హాస్టల్ వార్డెన్ ను సస్పెండ్ చేయాలని ఆర్డీవోను ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app