SAKSHITHA NEWS

సాక్షిత : మియాపూర్, చందానగర్ డివిజన్ల పరిధిలోని పటేల్ చెరువు, గంగారాం పెద్ద చెరువుల సుందరికరణ, సంరక్షణ, అభివృద్ధి పనుల పై మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం లో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ మరియు HMDA ,టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి సమీక్షా సమావేశం జరిపిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ
మియాపూర్ డివిజన్ పరిధిలోని పటేల్ చెరువు ను 13 కోట్ల రూపాయల అంచనా వ్యయం తో సుందరికరణ చేపడుతున్నామని మరియు
చందానగర్ డివిజన్ పరిధిలోని గంగారాం పెద్ద చెరువు అభివృద్ధి లో భాగంగా 19.06 పంతొమ్మిది కోట్ల ఆరు లక్షల రూపాయల అంచనా వ్యయం తో చెరువు సుందరికరణ, సంరక్షణ,అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, ఇరిగేషన్ మరియు HMDA అధికారుల సమన్వయంతో అభివృద్ధి పనులు చేపట్టడం జరుగుతుంది అని, గంగారాం,పటేల్ చెరువుల అభివృద్ధి పనులను HMDA కు బదిలీ చేయడం జరిగినది అని, చెరువు లో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులు వేగం పెంచాలని, పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు.

అదేవిధంగా
నియోజకవర్గం పరిధిలోని అన్ని చెరువులను సమగ్ర అభివృద్ధి తో సుందరికరణ చేపట్టి ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం తీసుకురావాలని, చెరువుల సుందరికరణ అభివృద్ధి పనుల పై పలు సూచనలు, సలహాలు ఇవ్వడం జరిగినది, చెరువుల లో కలుషిత నీరు కలవకుండా చేపడుతున్న డ్రైనేజి వ్యవస్థ మల్లింపు పనులు వేగం పెంచాలని, పనులు నాణ్యత ప్రమాణాల తో చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అదేవిధంగా చెరువు సుందరికరణ లో భాగంగా చెరువు కట్ట పటిష్టం పరిచేలా పునరుద్ధరణ , మురుగు నీరు చెరువు లో కలవకుండా ప్రత్యేకంగా చెరువు చుట్టూ నిర్మించే మురుగు నీటి కాల్వ (UGD) నిర్మాణం మరియు అలుగు మరమ్మత్తులు, చెరువుల కట్ట బలోపేతం ,పునరుద్దరణ పనులు, వాకింగ్ ట్రాక్ వంటి పనులు చేపడుతామని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు చెరువుల సంరక్షణ లో భాగంగా చెరువు చుట్టూ ఫెన్సిగ్ (కంచె) నిర్మాణం మరియు చెరువు యొక్క అలుగు నిర్మాణము మరియు చెరువు సుందరికరణ పనులు చేపడుతున్నాం అని ,చెరువు సుందరికరణ మరియు అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని, నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అధికారులకు తెలియచేశారు అదేవిధంగా ప్రణాళిక తో పనులు చేపట్టాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .అదేవిధంగా చెరువులను సంరక్షణిచడమే ధ్యేయంగా పనిచేస్తున్నాం అని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. అసంపూర్తిగా మిగిలిపోయిన పనులు వేగవంతం చేయాలని, జాప్యం తగదని, త్వరితగతిన పూర్తి చేయాలని, చెరువు మధ్యలో హై ల్యాండ్ నిర్మాణం వలన చెరువు అందాలు తిలకించడానికి , ముఖ్యంగా పక్షులు సేద తిరడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది అని, బోటింగ్ ద్వారా హై ల్యాండ్ కి చేరుకోవచ్చు అని, హై ల్యాండ్ ను సుందరవనం గా ,శోభితవర్ణం గా తీర్చిదిద్దుతామని, అదేవిదంగా చెరువు ల చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి చెరువు ల ను సంరక్షిస్తామని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు .చెరువు ల వాకింగ్ ట్రాక్ నిర్మాణం గూర్చి అధికారులకు పలు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగినది .త్వరిత గతిన వాకింగ్ ట్రాక్ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు .

ఈ కార్యక్రమంలో HMDA అధికారులు EE పద్మ, DE జగన్మోహన్ AE జీవన్ రెడ్డి, AE శివకుమార్ రెడ్డి , టౌన్ ప్లానింగ్ ఏసీపీ సంపత్ మరియు చందానగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2023 04 20 at 4.27.04 PM

SAKSHITHA NEWS