సాక్షిత : వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గం పెద్దేము ల్ మండలం లో గ్రామ పంచాయతీ గాజీపూర్ లో ,సర్పంచ్ తలారి వీరప్ప ముదిరాజ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల భాగంలో, ఊరూరా చెరువుల పండుగ సందర్భంగా, గ్రామస్తులంతా, గ్రామం నుండి పెద్ద ఎత్తున బోనాలతో డప్పులు వాయిద్యాలతో, ఊరచేరువు కట్టమీద దారిపొడుగునా భక్తుల పూనకాలతో జోరుగా బయలు దేరారు ,చెరువు కట్టమీద గుండా మద్ధ్యచేరువులో బోనాల లోనియన్నం కుంబాలతో పూజలు నిర్వహించి రావడం చేశారు,మజీద్ ముందర టెంటు క్రింద, ఏర్పాటు చేసిన ఘుమ ఘుమ లాడే మటన్ పొలవు అన్నం తో,రుచికరమైన వంటలతో భోజనాలు చేశారు, ఊరుజనం అభాల గోపాలం సుమారు 650 మంది వరకు ఉన్నారు,అలాగే పెద్దేముల్ పోలీసులూ,పత్రికవిలేకరులు,ఉన్నారు తిన్నారు,
తెలంగాణ ఆటపాటలతో కొంత మంది కట్టమీద ఆడు కున్నారు.ఆనాటి తెలంగాణా ఉద్యమం గురించి సర్పంచ్ మాట్లాడినారు,ఆంధ్రవలసపాలకులను పారదోలుటకు,వెళ్లగొట్టుటకు సకల జనుల సమ్మె,మిలియన్ మార్చ్, ఊరవాడ వంటావార్పు,రైలు రోకో గురించి,కుల సంఘాల ర్యాలీలు చేయటం,CM KCR తెలంగాణ గురించి, నాడు చేసిన పోరాటంలో భాగంగా,నిరాహార దీక్ష చేపట్టడం ,తెలంగాణ వచ్చుడో KCR సచ్చ్చుడో అనే మాటలు చేప్పారు సర్పంచ్ ,ఇట్టి కార్య క్రమంలో వెంకటేష్ చారి MPTC ల సంఘం రాష్ట్ర నాయకులు, చర్ల రాములు ముదిరాజ్ బలహీనవర్గాల సంఘం మండలం కన్వీనర్ , వెంకటయ్య ఉపసర్పంచ్ గారు,ఫీల్డ్ అస్తెంట్ అబ్రహాం గారు,అధికారులు ప్రవీణ్ ,తదితరులు పెద్ద యెత్తున పాల్గొన్నారు.