SAKSHITHA NEWS

మన బడి మన భవిష్యత్తు


సాక్షిత రాజమహేంద్రవరం :
“మన బడి మన భవిష్యత్తు” పనుల పురుగతిలో సచివాలయ ఇంజనీరింగ్ అసిస్టెంట్ పాత్ర అత్యంత కీలకమైన పాత్ర కలిగి ఉందని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి స్పష్టం చేశారు
కలెక్టర్ ఛాంబర్ లో సర్వశిక్షా అభియాన్ పథక సంచాలకులు, ఇతర ప్రభుత్వ శాఖల ఇంజనీరింగ్ అధికారులతో “మన బడి మన భవిష్యత్తు” పై సమీక్ష నిర్వహించారు. అంతకు ముందు కలక్టరేట్ సమావేశ మందిరంలో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ తో జిల్లాలోనీ 655 పాఠశాలల్లో జరుగుతున్న స్కూల్ భవనాలలో పనుల పురోగతి పై సమీక్ష నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, మనబడి మన భవిష్యత్తు అభివృద్ధి పనులు విషయంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇంజనీరింగ్ పనులను పూర్తి చేసె క్రమంలో 5 శాఖల ఆద్వర్యంలో పనులను చేపట్టడం జరుగుతున్నట్లు తెలిపారు. ఆమేరకు మండలాలను కేటాయించడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా రూ .96.33 కోట్ల రివాల్వింగ్ ఫండ్ కు చెందిన రూ .77. 95 కోట్ల కు చెల్లింపులు పూర్తి అయ్యాయని అధికారులు తెలిపారు. పనులలో నాణ్యత ప్రమాణాలు కలిగి ఉండేలా ఇంజనీరింగ్ అసిస్టెంట్లు వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుందని కలెక్టర్ స్పష్టం చేశారు. మన బడి మన భవిష్యత్తు కింద చేపట్టవలసి ఉన్న పనులకు చెందిన ప్రతిపాదనలు అంచనాలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు.ఈ సమావేశంలో ఎస్ఎస్ఏ పీ డి ఎస్ . సుభాషిణి, పంచాయతీరాజ్ ఎస్ఈ ఎండి అలిముల్లా, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ డీ. బాల శంకర్రావు, జిల్లా పాఠశాల విద్య అధికారి కే. వాసుదేవ రావు, రాజానగరం డి ఈ రవి లు పాల్గొన్నారు

WhatsApp Image 2024 08 21 at 17.55.40

SAKSHITHA NEWS