SAKSHITHA NEWS

Oppose Modi’s policies of burdening people

ప్రజలపై భారాలు మోపే మోడీ విధానాలను వ్య‌తిరేకించండి
సమావేశంలో సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు పిలుపు.
ఒకే దేశం- ఒకే పన్ను పేరుతో కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీఎస్టీ పేరుతో ప్రజలపై వారాల మోపుతున్నారని దీనిని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం ఆలిండియా పిలుపుమేరకు 14 నుండి 27 వరకు దేశ రక్షణ బేరి కార్యక్రమం జయప్రదం కోసం బుధవారం నగరిలో సమావేశం జరిగింది.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సిపిఎం రాష్ట్ర నాయకులు దడాల సుబ్బారావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు.

ఒకే పన్ను పేరుతో మేలు జరుగుతుందని ప్రభుత్వం ఓదరగొడుతున్నదని దీనివలన ప్రజలపై మోయలేని భారం పడుతున్నదని తెలిపారు ఆహార పదార్థాలు మొదలుకొని స్మశానాల పనులు వరకు అన్ని రకాల వాటిపై జిఎస్టి విధించడం దారుణం అన్నారు.

కార్పొరేట్ కంపెనీ యాజమాన్యాలకు లక్షల కోట్ల రూపాయలు రాయితీలు ఇచ్చి ప్రజలపై భారాల మోపడం ఏమిటని ప్రశ్నించారు ప్రజల బాధలను కష్టాలను ఏమాత్రం పట్టించుకోని బిజెపి ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి ఈ కార్యక్రమం జరుగుతున్నదని ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

సిపిఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు మాట్లాడుతూ ఈ కార్యక్రమంను జయప్రదం చేయడానికి 21 న స్కూటర్ ర్యాలీ, 23 న బహిరంగసభ జరపనున్నట్లు తెలిపారు. జిల్లాలో అన్ని మండలాల్లోనూ ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. పేదలు, మధ్యతరగతి ప్రజలు ఉపయోగించే పాలు, పెరుగు వీటిపై కూడా జీఎస్టీ విధించడం దుర్మార్గమని తెలిపారు.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా మోసం చేసిన కేంద్ర ప్రభుత్వం వైఖరి పై రాష్ట్ర ప్రభుత్వం కూడా మెతక వైఖరి అవలంబించడం దారుణం అన్నారు. ప్రజలపై మోపుతున్న భారాలకు ప్రధానమైన కారణం కేంద్ర ప్రభుత్వం విధానాలే. వీటిపై ప్రజలందరూ ఐక్యంగా కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశం కు సిపిఎం నాయకులు పెరుమాళ్ అధ్యక్షత వహించగా చిరంజీవమ్మ,తంగరాజు,జగదీష్, కన్నన్, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS