మరోసారి టాప్ ప్లేస్ లో ఐఐటీ మద్రాస్
దేశంలోనే ఉత్తమ యూనివర్సిటీగా ఐఐటీ మద్రాస్(అన్ని విభాగాలు) నిలిచింది.
ఈ మేరకు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేమింగ్ (NIRF) జాబితాను విడుదల చేశారు.
యూనివర్శిటీ కేటగిరిలో 2019 లో ఏయూ 16వ స్థానంలో ఉండగా ఇప్పుడు 25కు పడిపోయింది. అలాగే ఎస్వీయూ 48వ స్థానం నుండి 87వ స్థానానికి వచ్చింది.
మేనేజ్మెంట్ కేటగిరీలో IIM అహ్మదాబాద్, ఇంజినీరింగ్లో IIT మద్రాస్, ఫార్మసీలో జమియా హల్దార్ద్ తొలి స్థానంలో నిలిచాయి.
ప్రస్తుతం ఉన్న 13 కేటగిరీలకు అదనంగా మరో మూడింటిని చేర్చి కేంద్రం ఈ ర్యాంకుల్ని ప్రకటించింది.