నగరి నియోజకవర్గం పుత్తూరు లో కరెంటు చార్జీల పెంపుపై వైఎస్ఆర్సిపి పోరుబాట బైక్ ర్యాలీ నిర్వహించిన మాజీమంత్రి రోజా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు. నగరి నియోజకవర్గ మాజీ మంత్రి రోజా ఆధ్వర్యంలో
నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలపై కరెంట్ చార్జీల బాదుడుపై వైయస్ఆర్ సీపీ పోరుబాట కార్యక్రమంలో భాగంగా వైఎస్ఆర్సిపి ముఖ్య నేతలతో కలిసి నిరసన తెలిపిన, పుత్తూరు ఆరేటమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి అక్కడ నుంచి ఎలక్ట్రికల్ డిఈఈ కార్యాలయం వరకు బైకు ర్యాలీ నిర్వహించి అధికారులకు కరపత్రం
అందజేశారు.
ఈ సందర్భంగా.కరెంటు చార్జీల పెంపును కూటమి ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని.
లేని యెడల చార్జీల పెంపును ఉపసంహరించుకునే వరకు పోరాటం ఆగదని.
ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యత్ కొనసాగించాలని ..
తక్షణమే గృహ వినియోగదారులపై మోపిన రూ.15,485.36 కోట్ల చార్జీల బాదుడును వెనక్కి తీసుకోవాలని..
కూటమి ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలపై..
ఈరోజు విద్యుత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన మంత్రి రోజా మరియు వైఎస్ఆర్సిపి నాయకులు.
ఈ కార్యక్రమంలో నగరి నియోజకవర్గం మండలాల ప్రజాప్రతినిధులు, వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున్న పాల్గొనడం జరిగింది.