
మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ భౌతికకాయానికి సీఎం చంద్రబాబు నివాళి అర్పించారు. మన్మోహన్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. దేశం గొప్ప ఆర్థిక సంస్కర్తను కోల్పోయిందని, ఆధార్, ఉపాధి హామీ సహా అనేక పథకాలు ప్రవేశపెట్టిన ఘనత మన్మోహన్ కి దక్కుతుందని, దూరదృష్టితో ఆర్థికసంస్కరణలు తీసుకొచ్చారని కొనియాడారు.
