SAKSHITHA NEWS

కాంగ్రెస్ పార్టీకి నులుకుర్తి రాజీనామా.

కాకినాడ: కాంగ్రె స్ పార్టీలో సుదీర్ఘ కాలంగా 25 ఏళ్ల పాటు వివిధ హోదాల్లో సేవలందించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నులుగుర్తి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నులుగుర్తి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో 1998 సంవత్సరంలో అప్పటి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులుగా ఉన్న డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగిందని అప్పుడు డిసిసి ప్రధాన కార్యదర్శిగా తనకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు అప్పగించడం జరిగిందన్నారు. అప్పట్నుండి కాంగ్రెస్ పార్టీలో పలు హెూదాలో పార్టీకి సేవలు అందించడం జరిగిందన్నారు. 2001లో కాకినాడ రూరల్ జడ్పిటిసి గాను 2006లో పెదపూడి జడ్పిటిసి గాను కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలవడం జరిగిందన్నారు. 2006లో జెడ్పీ చైర్మన్ పదవి వస్తదని ఎదురుచూసినప్పటికీ సీల్డ్ కవర్ ద్వారా జడ్పీ చైర్మన్గా సిహెచ్ వేణుగోపాలకృష్ణకు అవకాశం దక్కినప్పటికీ పార్టీకి సేవలు అందించడం జరిగిందని నులుకుర్తి చెప్పారు. అలాగే 2009లో 2019లో కాకినాడ రూరల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీకి గడ్డు కాలంలో కూడా కాకినాడలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కి నాయకులు దూరమైనప్పటికీ తాను కాంగ్రెస్ పార్టీకి విధేయుడుగా పని చేయడం జరిగిందన్నారు.

అనేకమార్లు వివిధ రాజకీయ పార్టీల నుండి ఆహ్వానం వచ్చినప్పటికీ వాటిని వదులుకొని కాంగ్రెస్ పార్టీకే కష్టపడి పనిచేయడం జరిగిందన్నారు. కాంగ్రెస్ పార్టీలో తనకు సహకరించిన మాజీ కేంద్రమంత్రి ఎం ఎం పళ్లంరాజు కి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు కి, పూర్వపు పిసిసి అధ్యక్షులు ఎన్ రఘువీరారెడ్డి, శైలజనాథ్, ఏఐసీసీ కార్యదర్శి క్రిస్టోఫర్, మయ్యప్పన్ ఏఐసీసీ కార్యదర్శి మస్తాన్ వలీ, జంగ గౌతమ్, కొరివి వినయ్ కుమార్ లకు, రాష్ట్ర నాయకులకు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నాయకులకు కార్యకర్తలకు, ముఖ్యంగా కాకినాడ రూరల్ నాయకులకు కార్యకర్తలకు ప్రజలకు నులుకుర్తి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.

తాను తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి కూడా రాజీనామా చేస్తూ తన రాజీనామా లేఖను ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజుకు పంపించడం జరిగిందన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి ప్రజలకు సేవ చేసే అవకాశం లభించడం లేదని త్వరలోనే తన రాజకీయ భవిష్యత్ కార్యాచరణను ప్రకటించడం జరుగుతుందని నులకుర్తి వెంకటేశ్వరరావు తెలిపారు.


SAKSHITHA NEWS