ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు ఓ వరమని, కళ్యాణదుర్గం నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వరనాయుడు అన్నారు. 13-01-2024 న అనంతపురం జిల్లా, కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎన్టీఆర్ భవన్ లో ఈనెల 18వ తేదీన జరగబోవు మెగా రక్తదాన శిబిరం గురించి ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఎన్టీఆర్ ట్రస్ట్ కష్టాల్లో ఉన్న పేద విద్యార్థులకు, పేద కుటుంబాలకు విద్య ఆరోగ్యపరంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిందని పేర్కొన్నారు. గత సంవత్సరంలో ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటుచేసి 650 యూనిట్ల రక్తాన్ని సేకరించి ట్రస్ట్ కు పంపామన్నారు. ఈ సంవత్సరం వెయ్యి యూనిట్ల రక్తాన్ని సేకరించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామని అందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…
ఎన్టీఆర్ ట్రస్ట్ పేదలకు వరం;ఉమామహేశ్వర నాయుడు
Related Posts
నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు.
SAKSHITHA NEWS నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవు. *స్పైసి పారడైస్ తనిఖీలు నిర్వహించిన అధికారులు. *ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ అన్వేష్ నగరపాలక సంస్థ పరిధిలోని స్పైసీ పారడైజ్ హోటల్లో నగరపాలక సంస్థ, ఫుడ్ సేఫ్టీ అధికారులు కమిషనర్ ఎన్.మౌర్య ఆదేశాల…
బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ
SAKSHITHA NEWS బాలిక హాస్టల్ కు రాంకీ ఫౌండేషన్ ఐరన్ షెల్ఫ్ లు, వంట పాత్రల వితరణ. పరవాడ లో ఉన్న ప్రభుత్వ బాలికల వసతి గృహానికి రామ్ కి ఫౌండేషన్ వారు 5 ఇనుప సెల్ఫులు, వంట పాత్రలు, స్టవ్,…