మహిళలకు ప్రత్యేక స్థానం కల్పించింది ఎన్టీఆర్……. తెదేపా నాగర్కర్నూల్ పార్లమెంట్ కన్వీనర్ బి. రాములు
ఘనంగా ఎన్టీఆర్ 30వ వర్ధంతి
సాక్షిత వనపర్తి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోమహిళలకు ప్రత్యేక చట్టాలను హక్కులను కల్పించి వారికి ఉన్నత స్థానానీ కల్పించిన ది నందమూరి తారక రామారావు అని అలాగే బడుగు బలహీన వర్గాల కు కూడు గూడు తో పాటు వారిసంక్షేమం కోసం పాటుపడిన మహోన్నత వ్యక్తి ఆనందమూరి తారక రామారావు అని తెదేపా నాగర్ కర్నూల్ పార్లమెంటు కన్వీనర్ బోలమోని రాములు
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతినీ పురస్కరించుకుని పట్టణ హనుమాన్ టెకిడి లోని ఎన్టీఆర్ విగ్రహానికి తెదేపా పార్టీ శ్రేణులతో కలిసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి పై విధంగా కొనియాడా రు.
అలాగే పట్టణ హమాలీలకు పండ్లు పంపిణీ చేయడం జరిగింది .అనంతరం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం B రాములు మాట్లాడుతూ అస్తవ్యస్తంగా ఉన్నటువంటి పాలనను అంతం చేస్తూ కేవలం 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టి ముఖ్యంగా పేదలకు కూడు, గూడు ,గుడ్డ అనే నినాదాన్ని సంపూర్ణంగా నెరవేర్చిన గొప్ప నాయకుడు NTR. తెలుగు భాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిన గొప్ప వ్యక్తి. ఆయన అని అన్నారు. .ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు వనపర్తి పట్టణ అధ్యక్షులు కాగితాల లక్ష్మయ్య , రాష్ట్ర నాయకులు సుధాకర్ నాయుడు శాకీర్ హుస్సేన్ అడ్వకేట్ , ఆవుల శ్రీను , కొత్త గొల్ల శంకర్ ఎండి దస్తగిరి హోటల్ బలరాం ,ఎండి గౌస్ మేదరి బాలయ్య ,వనపర్తి మండల నాయకులు చిట్యాల బాలరాజు గారు, పెద్దమందడి మండల నాయకులు గట్టు రాధాకృష్ణ ,అప్పాయిపల్లి బాలయ్య ,బొట్టుమన్యం,B శేఖర్, ఉపేందర్ ,MD ఫారుఖ్,శివాచారి, రాజ మేస్త్రి, దాసు,కృష్ణయ్య , K గిరి,D బాలరాజు మరియు NTR అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
