దుండిగల్, ఆగస్టు 30: దుండిగల్లో శ్రీ రాజరాజేశ్వర పోచమ్మ తల్లి బోనాల పండుగ సందర్భంగా ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారు ముఖ్యఅతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ గారు అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, పాడిపంటలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ప్రజలు ఐకమత్యంతో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
అనంతరం ఆలయ కమిటీ సభ్యులు మాజీ ఎమ్మెల్యే శ్రీ కూన శ్రీశైలం గౌడ్ గారిని శాలువాతో ఘనంగా సత్కరించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి డిసిసి ఉపాధ్యక్షులు శ్రీ కూన శ్రీనివాస్ గౌడ్ గారితో పాటు ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక కాంగ్రెస్ నాయకులు DCC ఉప అధ్యక్షులు ముత్యం రెడ్డి, మాజీ సర్పంచ్ కావలి గణేష్, డివిజన్ అధ్యక్షులు మల్లేష్ యాదవ్, ప్రేమ్, ఉదయ్ గౌడ్ లతొ పాటు భక్తులు, మహిళలు, యువత తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
