సివిల్స్ అభ్యర్థులకు సువర్ణావకాశం…
యూపీఎస్సీ-సీఎస్‌ఏటీ ఉచిత శిక్షణకు జూన్ 14న. ప్రవేశ పరీక్ష – మే 31లోపు దరఖాస్తు చేసుకోవాలి….
జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు….
సాక్షిత పెద్దపల్లి//జిల్లా ప్రతినిధి:
యూపీఎస్సీ-సీఎస్‌ఏటీ 2027 పరీక్షలకు సిద్ధమవుతున్న మైనారిటీ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ అందించనున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు తెలిపారు. ఈ శిక్షణకు ఎంపిక కోసం జూన్ 14న. ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్, మైనారిటీల సంక్షేమ శాఖ, హైదరాబాద్ సంయుక్తంగా 100 మంది మైనారిటీ అభ్యర్థులకు యూపీఎస్సీ-సీఎస్‌ఏటీ 2027 పరీక్షల కోసం ఉచిత కోచింగ్ అందించనున్నట్లు తెలిపారు. రిజర్వేషన్ నిబంధనల ప్రకారం మహిళలకు 33.33 శాతం సీట్లు, వికలాంగులకు 5 శాతం సీట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మైనారిటీస్ స్టడీ సర్కిల్‌లో తొలిసారిగా ప్రవేశం పొందే అభ్యర్థులందరూ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రవేశాలు పూర్తిగా మెరిట్ ప్రాతిపదికన ఉంటాయని, అభ్యర్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 లక్షలు మించరాదని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన సాధారణ లేదా ప్రొఫెషనల్ డిగ్రీ పూర్తి చేసిన మైనారిటీ అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అభ్యర్థులు మే 31లోపు cet.cgg.gov.in� వెబ్‌సైట్‌లో దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
యూపీఎస్సీ-సీఎస్‌ఏటీ 2027 శిక్షణ కోసం నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ జూన్ 14న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని మైనారిటీ గురుకుల బాలికల పాఠశాల, రంగంపల్లిలో నిర్వహించబడుతుందని తెలిపారు.
అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం cet.cgg.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చని, అలాగే directormscccctelangana@gmail.కామెంట్ ఈ -మెయిల్ లేదా 040-23236112 ఫోన్ నంబర్ ద్వారా కార్యాలయ పని దినాల్లో సంప్రదించాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి పి. నరేష్ కుమార్ నాయుడు సూచించారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
