చేతి రాత విద్యార్థుల జీవితంపై ప్రభావం చూపుతుంది…………సాహితీ కళావేదిక జిల్లా అధ్యక్షులు శంకర్ గౌడ్
సాక్షిత వనపర్తి :
విద్యార్థుల అందమైన చేతిరాత వారి భావి జీవితంపై చక్కని ప్రభావం చూపుతుందని సాహితీ కళా వేదిక జిల్లా అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్ అన్నారు. స్థానిక రేడియంట్ హై స్కూల్ లో న్యూ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేతిరాత శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ పిల్లల అందమైన చేతిరాత వారిలో క్రమ శిక్షణను,ఏకాగ్రతను, తప్పులు లేకుండా రాసే చిత్తశుద్ధిని అలవాటు చేస్తుందన్న పరిశోధకుల అభిప్రాయాన్ని గుర్తు చేశారు.చక్కని చేతిరాత విద్యార్థులకు మంచి మార్కులను,గురువుల అభిమానాన్ని పొందేలా చేస్తుందని శంకర్ గౌడ్ పేర్కొన్నారు.వేసవి సెలవులలో తల్లిదండ్రులు తమ పిల్లలను ఈ వైపుగా ప్రోత్సహించడం అభినందనీయమని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో చేతిరాత శిక్షణ నిపుణులు తరుణ్ మాస్టర్,వ్యాఖ్యాత బైరోజు చంద్ర శేఖర్,రామన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మెన్ దేశి రాములు,బండారు శ్రీనివాస్,నాగేశ్వర రెడ్డి,మద్దిలేటి విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
