హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని ప్రగతి నగర్ రోడ్, ఆంబీర్ చెరువు వద్ద ఉన్న నిమజ్జనం కొలనులో వినాయక విగ్రహాల నిమజ్జన ఏర్పాట్లను KPHB సీఐ , ట్రాఫిక్ ఎస్ఐ , జిహెచ్ఎంసి ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్, శానిటేషన్ అధికారులతో కలసి పరిశీలించిన కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు గారు.పి ఈ సందర్భంగా శ్రీనివాస రావు మాట్లాడుతూ, వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది అని, ప్రజలు అందరూ నిభందనలు ప్రకారం అధికారుల సూచనలతో తగు భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని, ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో KPHB సీఐ రాజశేఖర్ రెడ్డి, ట్రాఫిక్ సిఐ మాధవ్ రెడ్డి, జిహెచ్ఎంసి ఏఈ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ మహదేవ్, ఎలక్ట్రికల్ DE స్వప్న, ఇన్చార్జి సుధాకర్, శానిటేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
