డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాం : బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….
దుండిగల్ మున్సిపాలిటీ పరిధి దుండిగల్ డబుల్ బెడ్ రూమ్ ఇల్లా సముదాయాల లబ్ధిదారులు పేట్ బషీరాబాద్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిసి డబుల్ బెడ్ రూమ్ ఇల్లా సమదాయాలలోని ఖాళీ స్థలాలలో మసీదు నిర్మాణానికి స్థలాన్ని కేటాయించడంతోపాటు వీధి దీపాల ఏర్పాటు, స్మశాన వాటికకు స్థలం కేటాయింపు వంటి సౌకర్యాలను కల్పించాలని కోరగా ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాలలో మౌలిక వసతుల కల్పనతో పాటు ఆధ్యాత్మిక, ఆహ్లాదకర వాతావరణాన్ని ఏర్పాటు చేస్తామని అన్నారు. ఇప్పటికే మౌలిక వసతుల కల్పనలో భాగంగా ఆర్టీసీ బస్సు ఏర్పాటుతోపాటు అనేక సదుపాయాలను కల్పించామని, రానున్న రోజుల్లో కూడా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయాలలోని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు క్రిష్ణ, ధారా మహేష్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సముదాయాల వాసులు గోపి, దుర్గేష్, స్వర్ణ, రాజు, కృష్ణ, అబ్దుల్ హఫీజ్, అబ్దుల్ ఖాదర్, మహమ్మద్ జిలాని, షేక్ అక్రమ్, షేక్ పెరోజ్, మహమ్మద్ సలాం తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
