స్వామియే…శరణం అయ్యప్ప….
హరిహర సుతుడు, ఆనంద చిత్తుడు అయ్యప్ప దయతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలి: బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
నిన్న సాయంత్రం నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలో బ్యాగరీ యాదగిరి ఆధ్వర్యంలో బ్రహ్మశ్రీ వై.రాజన్ నంబూద్రి గురుస్వామి కరకములములచే నిర్వహించిన “శ్రీశ్రీశ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ” కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ఆ హరిహర సుతుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…హరిహర సుతుడు, ఆనంద చిత్తుడగు అయ్యప్ప స్వామి దయ, కృపా కటాక్షాలతో ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలన్నారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధన్ రాజ్ యాదవ్, బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, మాజీ కార్పొరేటర్ బొర్రా దేవి చందు ముదిరాజ్, శ్రీ అయ్యప్పస్వామి దేవాలయ చైర్మన్ కొలన్ చంద్రశేఖర్ రెడ్డి, ఆహ్వానితులు కన్నెస్వామి బ్యాగరి వివేక్, 10వ డివిజన్ అధ్యక్షులు పి.నాగేష్ (సన్నీ), సీనియర్ నాయకులు ప్రేమ్ కుమార్, జగన్, దుర్గయ్య, సాంబశివారెడ్డి, బొబ్బ శ్రీనివాస్, జశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
