ఆపద సమయంలో ఆపద్బంధువు మా నాయకులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….: బిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు….
126 – జగద్గిరిగుట్ట డివిజన్ శ్రీనివాస్ నగర్ కు చెందిన నాగుల కృష్ణ గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న విషయాన్ని స్థానిక బిఆర్ఎస్ నాయకుల ద్వారా తెలుసుకున్న బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ గారు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి బాధితుడు నాగుల కృష్ణ కు 1,10,000/- రూపాయలను మంజూరు చేయించగా ఈరోజు చింతల్ లోని ఎమ్మెల్యే కార్యాలయంలో డివిజన్ కు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు బాధితుడికి ఎల్వోసీ మంజూరు పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ….ఆపద సమయంలో ఆపద్బంధువు మా నాయకులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని, అత్యవసర సమయంలో ఆసుపత్రి వైద్యానికి అర్హులైన ప్రతీ ఒక్కరూ ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ జగన్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు రుద్ర అశోక్, నాయకులు ఆజమ్, పాపులు గౌడ్, శశిధర్, ఖయ్యూమ్, బిఎస్ఆర్ నాని తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY
