SAKSHITHA NEWS

ప్రతిపక్ష హోదాపై హైకోర్టుకు జగన్‌, స్పీకర్‌కు నోటీసులు

ఏపీ అసెంబ్లీలో తమకు ప్రతిపక్ష హోదా కల్పించాలని కోరుతూ హైకోర్టునుమాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఆశ్రయించిన సంగతి తెలిసిందే. జగన్ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. జగన్ పిటిషన్‌కు కౌంటర్ దాఖలు చేయాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు, అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది.

ప్రతిపక్ష హోదాకు సంబంధించిన రూల్ పొజిషన్ వివరాలను న్యాయస్థానం ముందు పెట్టాలని వెల్లడించింది. ఇక తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది.

గత ఎన్నికల్లో టీడీపీ కూటమికి 164 స్థానాలు రాగా వైసీపీ 11 స్థానాలకే పరిమితమైంది. అయితే వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని జగన్..స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఆనవాయితీ ప్రకారం ముఖ్యమంత్రి తర్వాత ప్రతిపక్ష నేతతో ప్రమాణస్వీకారం చేయాలని కానీ అలా జరగలేదని లేఖలో పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు ఇవ్వొద్దని నిర్ణయం తీసుకున్నారా చెప్పాలని డిమాండ్ చేశారు.

WhatsApp Image 2024 07 30 at 13.26.21

SAKSHITHA NEWS