SAKSHITHA NEWS

చెన్నూరు మండల కేంద్రం లో నేతకాని పొలాల పండుగ జాతర జరిపిన నేతకాని నాయకులు నేతకాని కులానికి పవిత్రమైన పండుగ పోలాల పండుగ ఈ పండుగను 5 రోజుల పండుగగా పవిత్రంగా జరుపుకుంటారు.బోనాలు పోసుకుకోవడం,ఎద్దులను పూజించి ఎద్దుల మట్టి విగ్రహాలను నిమజ్జనం చేస్తారు.ఇంత పవిత్రంగా నిర్వహించుకునే పోలాల పండగ జాతరను చెన్నూరు లో నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి చెరువుకట్ట వరకు పాదయాత్ర తో నృత్యాలు చేస్తూ ర్యాలీ గా వెళ్లి చెరువులో ఎద్దుల విగ్రహాలను నిమజ్జనం చేశారు.

ఆ సంగం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం పోలాల పండుగను అధికారికంగా నిర్వహించాలని,మా విద్యార్థులకు,ఉద్యోగులకు ఇబ్బంది లేకుండా 5 రోజుల సెలవులు ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొత్తపల్లి గంగేష్,జాడి రాజేష్,జాడి యేసయ్య,కామెర సంపత్,దుర్గం నగేష్,దుర్గం స్వామి,జనగామ తిరుపతి,కుమ్మరి రాజేందర్,పాయిడ మహేష్,ఎన్నాం భాస్కర్,సోదారి సమ్మయ్య,మరియు మహిళా నాయకురాల్లు మరియు కులసంగం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


SAKSHITHA NEWS